కే‌సి‌ఆర్ ప్లాన్స్ అర్థం కావట్లే ?

తెలంగాణ ముఖ్యమంత్రి సి‌కే‌ఆర్( CM KCR ) ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో అంచనా వేయడం చాలా కష్టం.

అందుకే ప్రత్యర్థులు సైతం ఆయన చతురతను మెచ్చుకుంటూ ఉంటారు.

మరి ముఖ్యంగా ఎన్నికల టైమ్ లో ఆయన వ్యూహాలను, ప్రణాళికలను అంచనా వేయడం ప్రత్యర్థి పార్టీ నేతలకు ఒక టాస్క్ లా ఉంటుంది.గత ఎన్నికల టైమ్ లో ఎవరు ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు.

ఈసారి కూడా కే‌సి‌ఆర్ అలాగే చేస్తారేమో అని ప్రత్యర్థి పార్టీ నేతలు మొదటి నుంచి భావిస్తున్నారు.అయితే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని కే‌సి‌ఆర్ అండ్ కో ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూ వస్తూనే ఉంది.

ఇక మరోసారి రాష్ట్రంలో ముందస్తుకు సంబంధించిన చర్చ జరుగుతోంది.

Advertisement

ఎందుకంటే గత ఎన్నికల టైమ్ లో మూడు నెలల సమయం ఉండగానే అభ్యర్థులను ప్రకటించి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు కే‌సి‌ఆర్.ఇప్పుడు కూడా ఎన్నికలకు మూడు నెలలు సమయం ఉండగానే అభ్యర్థులను ప్రకటించారు.దీంతో మరోసారి ఎవరు ఊహించని విధంగా కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు తెరతీస్తారా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు కొందరు విశ్లేషకులు.

దానికి తోడు మొదటి జాబితాలోనే దాదాపు 115 స్థానాల అభ్యర్థులను ప్రకటించారు.ఇంకా మిగిలింది కేవలం నాలుగు స్థానలే దీన్ని బట్టి చూస్తే.ఇవి ముందస్తు ఎన్నికలకు సూచనలే అనేది కొందరి అభిప్రాయం.

అటు ప్రధాన ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ ( Congress party )పార్టీలు ఇంకా అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జన పడుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ అనూహ్యంగా ముందస్తుకు వెళితే ఈ రెండు పార్టీలు డిఫెన్స్ లోకి వెళ్ళే అవకాశం ఉంది.ఇక వచ్చే నెల మొదటి వారంలో లేదా రెండో వారంలో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ, ( Bjp party )కాంగ్రెస్ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.

మొత్తానికి బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో అర్థం కాక ప్రత్యర్థి పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.మరి కే‌సి‌ఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? లేదా మూడు నెలలే సమయం ఉండడంతో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా అనేది చూడాలి.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు