కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.బీజేపీని విమర్శించే హక్కు రాహుల్ గాంధీకి లేదన్నారు.
రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు.అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పారిపోయిన వ్యక్తి రాహుల్ అని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటేనన్న కిషన్ రెడ్డి రెండు పార్టీలు కుటుంబ పార్టీలేనని పేర్కొన్నారు.గతంలో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయన్న విషయాన్ని గుర్తు చేశారు.
రెండు పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వెల్లడించారు.







