ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి.ఈసారి ఎన్నికల్లో విజయం కోసం అధికార వైసీపీ( YCP ) తో పాటు ప్రతిపక్ష టీడీపీ( TDP) మరియు జనసేన కూడా గట్టిగా పోటీ పడుతుండడంతో గెలుపెవరిది అనే చర్చ జోరుగానే సాగుతోంది.
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పడం ఖాయమని టీడీపీ, జనసేన పార్టీలు( Janasena ) చెబుతున్నాయి.ఆ వ్యతిరేకతే తమ పార్టీలకు ప్లెస్ అవుతుందని, తమ పార్టీలకు అధికారాన్ని కట్టబెడుతుందని టీడీపీ, జనసేన పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి.

అయితే అటు వైసీపీ మాత్రం వ్యతిరేకతను ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ మాదే విజయం అని కుండబద్దలు కొడుతోంది.ఈసారి ఎన్నికల్లో గత ఎన్నికలతో పోల్చితే మెరుగైన ఫలితాలు రబడతామని కూడా చెబుతున్నారు వైసీపీ నేతలు.అందుకే .175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.కాగా ప్రస్తుతం వైసీపీపై ఏపీలో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే అయినప్పటికి ఆయన విజయాన్ని అపలేవని ఇప్పటివరకు వెలువడిన ప్రతి సర్వే కూడా స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది.వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఇటీవల వెలువడిన టైమ్స్ ఆఫ్ నౌ నవ భారత్ సర్వే సంస్థ( Times of Now Nava Bharat Survey Institute ) వెల్లడించింది.

ఏపీలోని దాదాపు 25 ఎంపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందట.ఇది నిజంగా టీడీపీని కలవర పెట్టె అంశమే.వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఆ పార్టీ పనైపోయినట్లే.ఎందుకంటే ఎలక్షన్స్ తరువాత రిటైర్ అవుతానని అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.దాంతో పార్టీ గెలవక పోతే.ముందుకు నడిపించే సమర్థవంతమైన నాయకత్వం కొరవడుతుంది.
ప్రస్తుతం నారా లోకేశ్ నాయకత్వంపై సొంత పార్టీ నేతల్లోనే అనుమానాలు ఉన్నాయి.దీంతో టీడీపీకి వచ్చే ఎన్నికలు డూ ఆర్ డై లా మారాయి.
ఇక ఇప్పటివరకు వచ్చిన ప్రతి సర్వే ఫలితాలు కూడా వైసీపీకే ఫేవర్ గా రావడంతో చంద్రబాబుకు మరోసారి నిరాశ తప్పదేమో అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.మరి ఏం జరుగుతుందో చూడాలి.







