ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు.. జల వివాదం పై డీకే అరుణ కామెంట్స్.. !!

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి.అందులో హుజురాబాద్ ఉపఎన్నిక జరగడం ఖాయం.

అయితే ఈ ఎన్నికల్లో ఈటలను కోలుకోకుండా చేసి రాజకీయాల్లో వెనకబడేసి తమ ప్రతాపాన్ని చూపించాలని కారు పార్టీ నేతలు పన్నాగాలు పన్నుతున్నారంటూ ఈటల అనుచరులు గుసగుసలాడుకుంటున్నారట.కాగా ఇప్పుడు ఈటల పువ్వు గుర్తు పంచన చేరి పదిలంగా పావులు కదుపుతున్నట్లుగా సమాచారం.

ఇదిలా ఉండగా అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీని బీజేపీ నేతలు విమర్శలతో కమ్మేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల జలవివాదం పై ఫైర్ అవుతూ ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారు, మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేప‌ట్టిన ఆర్డీఎస్ ప‌నుల‌ను ఆపి నిరూపించుకోండని సవాల్ విసిరారు.ఇకపోతే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పటివో అయినా కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికలు ఉన్న నేపధ్యంలో ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

Advertisement

మేడం కోటి విద్యలు కూటి కొరకే అనే సామేతలు మరచిపోతే ఎట్టాగండి మీ కొట్లాటలు ఆపి ప్రజలకోసం ఆలోచించండని సామాన్యుడి వాక్కు.

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ...క్లారిటీ ఇచ్చిన టీమ్!

Advertisement

తాజా వార్తలు