DJ Tillu 2: డేట్లు కుదరలేదా.. డీజే టిల్లు ఓవరాక్షన్ చేశాడా.. అనుపమ ఎందుకు అవుట్?

డీజే టిల్లు సినిమా సీక్వెల్ ప్రస్తుతం రూపొందుతున్న విషయం తెలిసిందే.సిద్దు జొన్నలగడ్డ హీరో గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్స్ నమోదు చేసుకుని ఈ ఏడాది లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

 Dj Tillu 2 Movie Heroine Anupama Parameswaran News Goes Viral Details, Dj Tillu,-TeluguStop.com

ప్రస్తుతం ఆ సినిమా కు సంబంధించిన సీక్వెల్ రూపొందుతోంది.సీక్వెల్ హీరోయిన్ కి సంబంధించిన విషయం లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

మొదట హీరోయిన్ గా పార్ట్‌ 1 హీరోయిన్‌ నే తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి.ఆ తర్వాత అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.

కొన్ని రోజుల పాటు చిత్రీకరణ కూడా చేశారు.కానీ ఆమె డేట్లు కుదరడం లేదు అంటూ తప్పుకోవడంతో మరో హీరోయిన్ ని ఎంపిక చేసుకోవడం జరిగింది.

మడోనా సెబాస్టియన్ హీరోయిన్ గా డీజే టిల్లు సీక్వెల్ రూపొందుతోంది.ప్రస్తుతం సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.2023 లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.అనుపమ పరమేశ్వరన్ తప్పుకోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హీరో సిద్దు జొన్నలగడ్డ ఓవరాక్షన్ వల్లే అనుపమ పరమేశ్వరన్ తప్పుకుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే.

Telugu Dj Tillu, Dj Tillu Sequel, Telugu, Top-Movie

మరి కొందరు మాత్రం సినిమా షూటింగ్ కార్యక్రమాలకు ఆమె హాజరు కాకపోవడం వల్లే ఆమె ను తప్పించారు అంటూ కొందరు చెబుతున్నారు.మొత్తానికి సిద్దు జొన్నలగడ్డ కి ఈ సినిమా సక్సెస్ అయితే స్టార్ గా ఎదగడం ఖాయం.కానీ ఈ సినిమా ఆయనకు సక్సెస్ నీ తెచ్చి పెడుతుందా లేదా చూడాలి.

సిద్ధు జొన్నలగడ్డ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది.కానీ టిల్లు వంటి సక్సెప్ పడలేదు.

ఇప్పుడు  ఆయన కెరీర్ టర్న్ అయినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube