భార్యను పక్కన పెట్టుకుని మరో హీరోయిన్‌కు చైతూ లిప్‌ లాక్‌... పాపం సమంత

సినిమాల్లో ముద్దులు, ముచ్చట్లు, రొమాన్స్‌, స్కిన్‌ షోలు చాలా కామన్‌.పెళ్లి అయినంత మాత్రాన నేను వాటిని చేయలేను అంటే మాత్రం కెరీర్‌ ఖతం అయినట్లే.

 Divyansha Kaushik Liplock With Naga Chaitanya-TeluguStop.com

హీరోలు మరియు హీరోయిన్స్‌ విషయంలో అదే వర్తిస్తుంది.అందుకే పెళ్లి అయిన హీరో హీరోయిన్స్‌ కూడా ఎలాంటి బేషజాలు లేకుండా నటిస్తారు.

అయితే భార్య భర్తలు ఒక సినిమాలో నటించడం, ఆ సినిమాలో భర్త మరో హీరోయిన్‌తో లిప్‌ లాక్‌ చేయడం అనేది చాలా అరుదుగా కనిపించే విషయం.ఈ సంఘటన మజిలీ చిత్రంలో జరుగబోతుంది.

‘మజిలీ’ చిత్రంలో నాగచైతన్య మరియు సమంత కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా దివ్యాన్ష కౌశిక్‌ నటించింది.నేడు ప్రేమికుల రోజు సందర్బంగా ఈ చిత్రం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.టీజర్‌లో సినిమా కథను దాదాపుగా రివీల్‌ చేశారు.యంగ్‌ ఏజ్‌లో ఉన్న సమయంలో చైతూ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయితో లిప్‌ లాక్‌ కూడా అవుతుంది.అయితే కొన్ని కారణాల వల్ల సమంతను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.

అతడికి ఇష్టం లేని పెళ్లి అయినా కూడా సమంతకు చైతూ అంటే చాలా ఇష్టం ఈ విషయాలు సినిమాలో చాలా డ్రమటిక్‌గా చూపించబోతున్నట్లుగా టీజర్‌ చూస్తేనే అర్థం అవుతుంది.

ఇక సమంతతో ఈ చిత్రంలో ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉండే నాగచైతన్య మరో హీరోయిన్‌తో మాత్రం లిప్‌ లాక్‌ చేయడం జరిగింది.చైతూ లిప్‌లాక్‌ సీన్‌ సమయంలో సమంత ఎంత బాధపడి ఉంటుందో కదా అంటూ సోషల్‌ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.పాపం సమంత అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు.

అయితే ఇది సినిమా అనే విషయం అంతా గుర్తించాలి, దీన్ని ఎవరు కూడా సీరియస్‌ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కొందరు అక్కినేని ఫ్యాన్స్‌ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube