జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎస్ ఆదేశం

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ( CS Shanti Kumari )ఆదేశించారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాణనష్టం కలగొద్దని,హైదరాబాద్ నుంచి సహాయ,సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

పెద్ద వాగు వరద పరిస్థితిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడం వల్ల గేట్లు ఎత్తడంతో దిగువ భాగంలోని గ్రామాల రైతులు వరద నీటిలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్,ఎస్పీ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో పునరావాస చర్యలపై చర్చించారు.

గిరిజన సంక్షేమ శాఖలో అవినీతి మరకలు...!
Advertisement

Latest Nalgonda News