బకాయిలు చేల్లించని ప్రభుత్వంపై ఎందుకు కేసులు పెట్టకూడదు - వ్వవసాయ కార్మిక సంఘం కార్యదర్శి డి వెంకన్న

ఉపాధిహమి కూలీలకు బకాయిలు చేల్లించని ప్రభుత్వం పై కూలీలు ఎందుకు కేసులు పెట్టకూడదని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మికసంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.శనివారం దేవరాపల్లి లో ఉపాధి కూలీలు ఆకులు చేతితో పట్టుకోని కూలిలు భకాయిలు అయిన చేల్లించండి తిండి అయిన పెట్టండి అంటు పెద్దఎత్తున నిర్సన తెలిపారు.

 District Farmers Labors Association Secretary D Venkanna Fires On Ap Government-TeluguStop.com

అనంతరం అయిన మాట్లాడారు జిల్లా లోని పెండింగ్ లో ఉన్న భకాయిలు వెంటనే చేల్లించని ప్రభుత్వం పై కూలీలు ఎందుకు కేసులు పెట్టకూడదని ప్రశ్నించారు.ఉపాధి హామీ చట్ట ప్రకారం రెండు వారల్లో భకాయిలు చేల్లించక పోతే కూలీలు కేసులు పెట్టుకోవచ్చునని చట్టంలో ఉందన్నారు.

ఎనిమిది వారాలు నుండి ప్రభుత్వం భకాయిలు చేల్లించకుండా కూలీలను ఉసురు పెడుతుందని తెలిపారు.సెష్, డిజిల్ ధరలు పెరిగాయని ఆర్టీసీ చార్జీలు పెంచటం కరంటు పెట్రోల్ డిజిల్ గ్యాస్ వంటనూనె ధరలు వీపరీంగా పెరిగి పోవడం చేసిన పనికి డబ్బులు ఇవ్వక పోవడం కూలీలు అప్పులు చేసుకుని తింటున్నారని తెలిపారు.

ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితి మునుపు ఎన్నడు లేదన్నారు వెంటనే భకాయిలు చేల్లించాలని డిమాండ్ చేసారు.సమ్మర్ ఎలవెన్స్ పునరిద్దించాలని నేషనల్ వైడ్ సాప్ట్ వైరును రద్దు చేయాలని పాత పద్దతిలోనే పనులు కోనసాగించాలని డిమాండ్ చేసారు.

కేంధ్రప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీయం చేయడం కోసం పూనుకుందని అందులో బాగంగానే సాఫ్టువేరు మార్పుచేయడం రెండు పూటల పని,అనిచేప్పడం మేట్లును మార్పులు చేయడం సమ్మర్ ఎలవెన్సును ఎత్తేయడం బడ్జెట్ లో నిదులు కొరత విధించడం చేస్తుందని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించక పోగ ప్రభుత్వానికి రావలసిన మేటిరియల్ చార్జీలు కోసం కూలిలతో బలవంతంగా అమలు చేస్తుందని తెలిపారు కూలీలు ఐక్యంగా పోరాటం ద్వారా తిప్పికొట్టాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 25 వేల కోట్లు తగ్గించిందని ఇక నుండి కూలీలు రెండు పూటలా పని చేయాలని సమ్మర్ అలవెన్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకిటించిందన్నారు.

ఉపాధి హామీ పనులు చేస్తే కొలతల ప్రకారం వేతనాలు ఇస్తున్నారు తప్ప రోజు కూలీ ఇవ్వడం లేదన్నారు.ఇప్పటికీ కొన్ని చోట్ల 60 రూపాయల నుండి 70 రూపాయలు మాత్రమే కూలి వచ్చే గ్రామాలు ఉన్నాయని అంటే రెండు పూటలా పని అంటే ఉదయం ఆరు గంటల నుండి 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు రోజుకు 8 గంటలు పని చేస్తే మాస్టర్ వేసుకోవాలని నిభందనులు పెట్టారని తెలిపారు.

దీంతో అత్యధిక మంది కూలీలు పనులు మానేసరని తెలిపారు.ఇది అత్యంత దుర్మార్గమన్నారు అన్నారు.

ఎట్టిపరిస్థితుల్లోను రెండు పూటల పని చేయలేమని కూలీలు తేగిసి చేబుతున్నారని పని ప్రదేశానికి 5 కిలోమీటర్లు ఉంటే రోజుకు 20 కిలోమీటర్లు నడవాలని కూలీలిలు శక్తి అంత దీనికే సరిపోతుందని తెలిపారు.

ఈసంవత్సరం ఎండకి తట్టుకోలేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కనీసం టెంట్ సౌకర్యం కూడా కల్పించ లేదన్నారు.

పోని కొలతలు లేకుండా వేతనం 257 రూపాయలు ఇస్తారా అంటే అది లేదన్నారు.మార్చి నుండి జూన్ వరకు ఎండాకాలంలో నేల గట్టిగా ఉంటుందని గునపాం గడ్డపార దిగదుకాబట్టి, సమ్మర్ అలవెన్సు ఇచ్చే వారని కానీ ఇప్పటి నుండి సమ్మర్ ఎలవెన్సు రద్దు చేస్తున్నామని జీవో ఇచ్చి రద్దు చేసారని అన్నారు.

దీనివలన కూలిలే ఈపనులు మాకు వద్దంటూ పనికి దూరం అయ్యెవిదంగా ప్రభుత్వం చేయడం కోసం ప్రభుత్వం పూనుకుంటుందని అందుకనే ఉపాధి హామిర క్షణ కొరకు ఆందోళనలు చేయాలని కోరారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ నెంబర్.17000 (31)ను రద్దు చేయాలి.ఉపాధి హామీ లో రెండు పూటల పని రద్దు చేయాలి.100 రోజులు పని చేసిన ప్రతి కుటుంబానికి పనిముట్లు టెంటు ఇవ్వాలి.బకాయి వేతనాలు ఇచ్చేటప్పుడు వడ్డీతో కలిపి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఉపాధి హామీ కి 2 లక్షల కోట్లు నిధులు కేటాయించాలని.

కుటుంబానికి 200 రోజులు పని రోజుకి 600 రూపాయల వేతనం ఇవ్వాలి.దరఖాస్తు చేసుకున్న వారికి పని కల్పించక పోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలని వెంకన్న డిమాండ్ చేసారు.

ఈకార్యక్రమంలో ఆదికసంఖ్యలో కూలీలు పల్గోన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube