ధాన్యం కొనుగోలు ఏర్పాట్ల పై జిల్లా కలెక్టర్లతో సి.ఎస్. సోమేశ్ కుమార్

రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు ప్రకటించిన నేపథ్యంలోరాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలికాన్ఫరెన్స్ సోమేశ్ కుమార్ నిర్వహించి పలు ఆదేశాలతో తో పాటు పలు సూచనలు చేశారు.ప్రతీ జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 District Collectors On Grain Purchase Arrangements , District Collector , Grain-TeluguStop.com

మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలు లో నిమగ్నం చేయాలన్నారు జిల్లా కలెక్టరేట్ లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు.

రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ లోను ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు.

తమ జిల్లాలో సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిపి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులచే వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను క్షేత్ర స్థాయిలో సందర్శించాలన్నారు.గత యాసంగి లో ఏర్పాటు చేసినన్ని కేంద్రాలు లతో పాటు అవవసరం అయితే అంతకన్నా ఎక్కువైనా ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలను కల్పించాలని,ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు,గన్ని బ్యాగుల సేకరణకై ప్రత్యేక దృష్టిని సాధించాలి, దీనికై ప్రత్యేక అధికారిని నియమించి తగు పర్యవేక్షణ చేయాలి.

Telugu Cm Kcr, Cs Somesh Kumat, Sell Paddy-Political

వ్యవసాయవిస్తరణ అధికారుల సేవలను ధాన్యం కొనుగోలు లో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి.తమ జిల్లాలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో ఏవిధమైన సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించాలి.సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేందుకు తగు వాహనాల ఏర్పాట్లను చేసుకోవాలన్నారు ప్రతీ రోజు ధాన్యం సేకరణ వివరాల నివేదికలు సమర్పించాలి, జిల్లాలో వారి కోతల వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉన్నాయి.

వీటి ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు.పొరుగు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలని, దీనికై పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

టెలికాన్ఫరెన్స్ ప్రోగ్రాంలో లో సోమేశ్ కుమార్ తో పాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పౌర సరఫరాల శాఖ కమీషనర్ అనీల్ కుమార్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి లు కూడా పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube