ప్రతిపక్షం బహిష్కరించిన ఎన్నికల్లో గెలిచామని చంకలు కొట్టుకోవడం జగన్ రెడ్డి పిచ్చికి పరాకాష్ట అని, ఆయనకు నిజంగా ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని ఆలోచన ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు.సోమవారం చంద్రబాబు అధ్యక్షతన పార్టీ స్ట్రాటజీ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం వదిలేసిన ఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచానని సంబరపడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.గుజరాత్ లో 9 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడడంతో భవిష్యత్తులో ఏపీ మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ స్మగ్లర్లకు తాడేపల్లితో లింకు లేకపోతే అంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఏపీకే ఎలా తరలించే ప్రయత్నం జరుగుతుంది అని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఎప్పటికీ గంజాయి స్మగ్లింగ్ పెరిగిపోయింది.
నాసిరకం మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారు.ఎర్రచందనం అక్రమ రవాణాకు ఏపీ కేరాఫ్ గా మారింది.అసోం లో తిరుమల శ్రీవారి కు చెందిన తలనీలాలు పట్టుబడ్డాయి.తలనీలలాను చైనాకు అక్రమంగా తరలిస్తున్నారు.
ఇలా జగన్ అవినీతి వైన్, మైన్, ల్యాండ్, శాండ్ మాఫియా అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని ఆయన ధ్వజమెత్తారు.ఇక ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటి పై దాడి చేయడమే కాకుండా బాధితులైన టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం జగన్ రెడ్డి రాజ్యాంగానికి నిదర్శనంగా పేర్కొన్నారు.
దీనిపై బిజేపిని రీకాల్ చేయాలని కేంద్రానికి, డీవోపీటీకి కి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

అలాగే అన్నదాతకు అండగా సంయుక్త కిసాన్ మోర్చా ఈ నెల 27న నిర్వహించనున్న భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలియ చేయాలని నిర్ణయించిందని అన్నారు.ఇప్పటికే విద్యుత్ చార్జీలను భారీగా పెంచిన ప్రభుత్వం ఇపుడు ఓటీఎస్ పేరుతో గృహ నిర్మాణం లబ్ధిదారులను దోచుకునేందుకు ప్రయత్నిస్తోందని.ఈ డబ్బు ఎవరు కట్టాల్సిన అవసరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఆర్థిక నిర్వహణ అరాచక స్థాయికి చేరింది శాంతిభద్రతలు సంక్షోభం ఏర్పడింది.కుంభకోణాలు తారస్థాయికి చేరాయి.
రాష్ట్రపతి పాలనకు అవసరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఈ సమావేశం అభిప్రాయపడింది.ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, రామానాయుడు, సోమిరెడ్డి, దూళిపాళ్ల, దేవినేని ఉమ తదితరులు పాల్గొన్నారు.