కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో అసంతృప్త జ్వాల రగులుతోంది.ఈ మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ సీటు కేటాయింపు వ్యవహారంలో అసమ్మతి రాగం వినిపిస్తోంది.
ఎల్లారెడ్డి స్థానం నుంచి టికెట్ ఆశించిన నేత సుభాష్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఎల్లారెడ్డి పార్టీ ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేశారు.
ఈ క్రమంలోనే అనుచరుల సమక్షంలో కన్నీటి పర్యంతం అయ్యారు.కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని సుభాష్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
అదేవిధంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో రెబల్స్ ను పోటీకి దింపుతానని చెప్పారు.అదేవిధంగా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థి మదన్ మోహన్ ను ఓడిస్తానని తెలిపారు.