ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు( DSP Praneet Rao ) తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో( phone tapping case ) ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నాంపల్లి కోర్టు పోలీసుల కస్టడీకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు న్యాయస్థానంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసు విచారణలో భాగంగా టెలిఫోన్ సర్వీసులకు సంబంధం లేకుండా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
పై అధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు వెల్లడించారని సమాచారం.







