భారత వ్యతిరేక చర్యలు: ఆ దేశాల్లో కుట్ర, బహిర్గతమైన సంచలన నివేదిక..!!

నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ అన్నదాతలు దాదాపు మూడు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయంగానూ మద్ధతు లభిస్తోంది.

అయితే రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తర్వాతి నుంచి పరిస్థితులు మారిపోయాయి.రైతుల ఆందోళన ముసుగులో ఖలీస్తానీ వేర్పాటు వాదులు దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారంటూ నిఘా వర్గాలు సంచలన నివేదికను బయటపెట్టాయి.

దీనికి తోడు రైతులకు మద్ధతుగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్ ట్వీట్ చేసిన ‘‘టూల్ కిట్ ’’ వ్యవహారం ఇప్పుడు రాజకీయాలను హాట్ హాట్‌గా మారుస్తోంది.అయితే అన్నదమ్ముల్లా కలిసి మెలిసి వున్న భారతదేశాన్ని విడగొట్టాలని తెర వెనుక జరుగుతున్న కుట్రకు సంబంధించిన వివరాలను ఓ నివేదిక బహిర్గతం చేసింది.

దీని వెనుక ఖలిస్థాన్, పాకిస్థాన్ వర్గాలు ఉన్నట్టుగా వెల్లడించింది.‘‘ది అనెండింగ్ వార్ - ఫ్రం ప్రాక్సీ వార్ టు ఇన్ఫో వార్’’ పేరుతో ఈ వివరాలను డిసిన్ఫో ల్యాబ్ నివేదిక తెలిపింది.

Advertisement

ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఆందోళనల్లో వివిధ దేశాల్లోని ఖలిస్థాన్ మద్ధతుదారులు, పాకిస్థాన్ నిఘా సంస్థ (ఐఎస్ఐ) సమన్వయంతో భారతదేశంపై తప్పుడు సమాచారంతో యుద్ధం చేస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.భారత్‌లోని ప్రస్తుత కల్లోల పరిస్థితులకు కొన్నేళ్ల నుంచి ఖలిస్థానీలు, ఐఎస్ఐ నిర్వహిస్తున్న ప్రచారమే కారణమని డిసిన్ఫో ల్యాబ్ అభిప్రాయపడింది.అమెరికాకు చెందిన ఖలిస్థానీ భజన్ సింగ్ భిందర్ గతంలో భారత దేశంలో ఉగ్రవాద దాడులను సమన్వయపరచినట్లు ఈ నివేదిక పేర్కొంది.

ప్రస్తుతం భారత వ్యతిరేక ప్రచారమంతా ఈయన సారథ్యంలోనే నడుస్తున్నట్లు నివేదిక తెలిపింది.భిందర్ తన సహచరుడు పీటర్ ఫ్రెడరిక్‌తోనూ, పాకిస్థాన్ అండదండలున్న ఓ సంస్థతోనూ కలిసి ఆర్గనైజేషన్ ఫర్ మైనారిటీస్ ఇన్ ఇండియా (ఓఎఫ్ఎంఐ) అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

భారత్‌లోని మైనారిటీల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేసినప్పటికీ, దీనిలో కనీసం ఒక్క భారతీయుడు కూడా లేడని డిసిన్ఫో పేర్కొంది.దీనిలో అమెరికన్ క్రిస్టియన్ మిషనరీ, ఓ ఉగ్రవాది, ఓ ఆఫ్రికన్-అమెరికన్, మరొక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నట్లు వివరించింది.

ముఖ్యంగా భారతీయ మీడియాలోకి చొచ్చుకెళ్ళడం, మన దేశంలోని ఉద్యమకారులు, పలువరు మేధావుల నెట్‌వర్క్ నుంచి మద్దతు లభించడం, దేశంలో సామాజిక మాధ్యమాలను ప్రభావితం చేయగలిగేవారిలో పలుకుబడి సంపాదించడం వల్ల ప్రస్తుత భారత వ్యతిరేక ప్రచారం తీవ్ర రూపం దాల్చిందని నివేదిక చెప్పింది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు