ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు మంతనాలు జరుపుతున్నారు.మంత్రి పదవులను ఆశిస్తున్న పలువురు నాయకులు డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.
ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావుతో పాటు మరి కొందరు నేతలు డీకే శివకుమార్ తో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని నేతలు కోరుతున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే డీకే శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ సీఎంపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు.అన్ని అంశాలనూ అధిష్టానమే చూసుకుంటుందని తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని శ్రీధర్ బాబు అన్నారు.పార్టీ నేతలందరినీ కలవడానికి ఢిల్లీకి వచ్చినట్లు స్పష్టం చేశారు.