ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్స్ లలో( Tollywood Heroines ) నెంబర్ 1 సీట్ ఖాళీగా ఉంది అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.చాలామంది హీరోయిన్స్ ఈ స్థానం కోసం పోటీ పడుతున్న ఖచ్చితంగా మరో ఏడాది పాటు ఎవరూ కూడా ఆ స్థానాన్ని చేరుకోలేరు అని అర్థమవుతుంది.
పైగా ఇప్పుడు కొత్త హీరోయిన్స్ కోసం టాలీవుడ్ వెతుకుతూనే ఉంది.ఎందుకంటే సీనియర్ హీరోయిన్స్( Senior Heroines ) అంతా ఫిమేల్ ఓరియెంటెడ్ పాత్రలు చేసుకుంటూ సైడ్ అయిపోయారు.
నిన్న మొన్నటి వరకు ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ అంతా పరాజయాల వల్ల ఐరన్ లెగ్స్ గా ముద్రపడి పక్కకు వెళ్ళిపోతున్నారు.ఇక కొంతమంది బాలీవుడ్ కి ఫిక్స్ అయ్యారు.
మరి కొంతమంది అప్ కమింగ్ వారిని మనవాళ్లు పట్టించుకోవడం లేదు.మరి ఇంత జరుగుతున్న ఇప్పుడు తెలుగు సినిమా దర్శకులకు, నిర్మాతలకు, హీరోలకు కావాల్సింది ఏంటి అంటే ఒక కొత్త ఫ్రెష్ పేస్.
అందుకోసమే నాని నుంచి విజయ్ దేవరకొండ వరకు అందరూ ఎదురు చూస్తున్నారు.ఎక్కడ కొత్త హీరోయిన్ దొరికితే వారిని పట్టేసుకుందామని ప్రయత్నిస్తున్నారు.కానీ ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఈ వరుసలో ముందుకొచ్చినా కూడా ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడానికి వారు రెడీగా లేకపోవడంతో మళ్లీ పరిస్థితి మొదటికే వచ్చింది.ప్రేమలు సినిమాతో మమిత బైజు( Mamitha Baiju ) లైన్ లోకి వచ్చింది.
ఈ అమ్మడు పేస్ కి టాలీవుడ్ ఫిదా అయిపోతుంది.కానీ ఎందుకో ఆమె ఒక సినిమా తెలుగులో చేయడానికి అంత తొందరగా ఒప్పుకోవడం లేదు.
ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమాలేమీ లేకున్నా టాలీవుడ్ వైపు మాత్రమే దృష్టి పెట్టడం లేదు.
ఇక ఇదే దోవలో కన్నడ నుంచి సప్త సాగరాలు దాటి రెండు భాగాల్లో నటించినా రుక్మిణి వసంత్( Rukmini Vasanth ) సైతం తెలుగులో బిజీ అవుతుందని అందరు భావించారు ఈ సినిమా ద్వారా రుక్మిణి చాలా మందికి నచ్చింది.కానీ ఆమె తెలుగు హీరోలకు సినిమా చేయడానికి రెడీగా లేదు.పైగా ఈమె పుట్టి పెరిగిన నేపథ్యం కూడా పూర్తిగా ఆర్మీ వాతావరణం కావడంతో హీరోల పక్కన గంతులు వేయడానికి సిద్ధంగా లేను అంటుంది.
ఈమెతో పాటు మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా భాగ్యశ్రీ బోర్సే( Bhagyashri Borse ) తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతోంది.అయితే ఎందుకో ఈ అమ్మడు కూడా ఆ సినిమాలు ఎంపిక విషయంలో జాగ్రత్త పడుతుంది.
అందుకు ప్రధాన కారణం గతంలో హీరోయిన్స్ చేసిన పొరపాట్లే అని చెప్పుకోవచ్చు.కృతి శెట్టి నుంచి శ్రీ లీల వరకు అందరూ ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి ఫ్లాప్స్ రావడంతో తెరమరుగైపోయారు.
అందుకే ఇప్పుడు వస్తున్న కొత్త హీరోయిన్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్నారు.