Disaster Movies: ఈ మధ్యకాలంలో భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చిన సినిమాలు..!

సినిమా విషయంలో ఎవరు ఎలాంటి అంచనాలను పెట్టుకున్న అవి జరుగుతాయని నమ్మకం ఉండదు.కొన్నిసార్లు ఎలాంటి అంచనాలు లేని సినిమాలు విజయం సాధిస్తాయి.

ఈ మధ్యకాలంలో వచ్చిన బలగం సినిమా ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.కొన్నిసార్లు అయితే భారీ అంచనాలతో థియేటర్లో సందడి చేస్తాడని ఊహించిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ చిత్రాలుగా నిలబడతాయి.

మరి ఆ భారీ అంచనాలతో ఈ మధ్య వచ్చిన సినిమాలు ఏంటో, వాటి ఫలితాలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఏజెంట్

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏజెంట్.( Agent Movie ) ఈ సినిమా కోసం అఖిల్ ఎయిట్ ప్యాక్ ట్రై చేశాడు.చాలా నెలలకు నెలలు జిమ్ లో వర్కౌట్ చేసి ఈ రకమైన ఫిజిక్ తో సినిమాలో అభిమానులను సర్ప్రైజ్ చేయాలని భావించాడు.

Advertisement

కానీ ఎవరు ఊహించని విధంగా దారుణమైన డిజాస్టర్ గా అఖిల్ ఏజెంట్ సినిమా నిలిచింది.ఇండస్ట్రీలో ఒక పెద్ద దర్శకుడు ఈ సినిమా గురించి మాట్లాడుతూ నాకు గుర్తున్నంతవరకు ఇంత దారుణమైన డిజాస్టర్ ఈ మధ్యకాలంలో రాలేదు అంటూ చెప్పడం విశేషం.

లైగర్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా( Liger ) కూడా దాదాపు ఏజెంట్ లాంటి ఫలితాన్ని చవిచూసింది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో పాటు బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే కూడా రంగంలోకి దిగింది.బాక్సింగ్ నేపద్యంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాలతో థియేటర్లలో విడుదల కాగా అత్యంత దారుణమైన పరాజయంగా నిలిచింది.

ఆ దెబ్బతో పూరి జగన్నాధ్ మరో చిత్రానికి కూడా పని చేయాలనుకున్న విజయ్ దేవరకొండ సైలెంట్ గా ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు .

ఆచార్య

చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తన కొడుకు రాంచరణ్ తో కలిసి తీసిన చిత్రం ఆచార్య ( Acharya ) ఈ సినిమాకు పరాజయం అంటే ఏంటో తెలియని కొరటాల శివ దర్శకత్వం వహించారు.అయినా కూడా ఈ సినిమా ఘోరమైన పరాజయాన్ని చదివి చూడాల్సి వచ్చింది.అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక సినిమా రావడం అనేది అత్యంత అరుదు అనే చెప్పాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఆ సినిమా తర్వాత వాల్తేరు సినిమాతో చిరంజీవి హిట్ అందుకున్నాడు అంతకన్నా ముందే ఆర్ఆర్ఆర్ సినిమాతో రాంచరణ్ హిట్ అందుకున్నాడు ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఉన్నారు రామ్ చరణ్ కి సైతం గట్టి షాక్ మిగిల్చింది ఆచార్య.

Advertisement

తాజా వార్తలు