అక్కినేని హీరో నాగచైతన్య ఇప్పటికే లవ్ స్టోరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు.రెండు నెలల క్రితమే ఈ సినిమా రావాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల చివరి నిమిషంలో వాయిదా వేశారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి హీరయిన్ గా నటించిన విషయం తెల్సిందే.ఇక నాగచైతన్య మరో సినిమా కూడా విడుదలకు సిద్దం అవుతోంది.
మనం చిత్రంతో దర్శకుడిగా స్టార్ డమ్ ను దక్కించుకున్న విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతన్య థ్యాంక్యూ సినిమా ను చేస్తున్నాడు.కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంకు ముందు ఈ సినిమా ఇటలీలో చిత్రీకరణ జరిపారు.
అక్కడ నుండి వచ్చి మళ్లీ హైదరాబాద్ లో కూడా కొన్ని రోజుల పాటు చిత్రీకరన చేశారు.దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పై మరింతగా స్పష్టతను దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఇచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.కేవలం 8 నుండి 10 రోజుల షూటింగ్ తో మొత్తం పూర్తి అవుతుంది.
సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.నిర్మాత దిల్ రాజు కనుక ఆయన మంచి టైమ్ కోసం వెయిట్ చేస్తాడు.
థియేటర్లు పూర్తి స్థాయిలో రన్ అవుతూ పోటీ ఎవరు లేని సమయంలో థ్యాంక్యూ ను విడుదల చేసే అవకాశం ఉంది.

అలాంటి సమయం దిల్ రాజుకు ఎప్పుడు అనిపిస్తుందో చూడాలి.నాగ చైతన్య ను ఈ సినిమా లో దర్శకుడు విక్రమ్ కె కుమార్ చాలా విభిన్నంగా చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.థ్యాంక్యూ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుందని దర్శకుడు చెబుతున్నాడు.
విక్రమ్ కె కుమార్ సినిమా లు అన్ని కూడా చాలా విభిన్నంగా ఉంటాయి.అలాగే ఈ సినిమా కూడా చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.