కేరాఫ్ కంచర పాలెం సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న వెంకటేష్ మహా నోటి దూల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.తను స్వయంగా ఒక దర్శకుడు అయి ఉండి మరో దర్శకుడు యొక్క క్రియేటివిటీ ని ఆ దర్శకుడు సృష్టించిన సినిమా లోని పాత్రలను అవహేళన చేసినట్లుగా మాట్లాడడం ఆయన విజ్ఞత కే వదిలేస్తున్నాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉన్నా మరి కొందరు మాత్రం ఆయన తీరు ను తీవ్రంగా తప్పుపడుతున్నారు.
కేజీఎఫ్ సినిమా గురించి వెంకటేష్ మహా చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.రూ.1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన సినిమా గురించి అలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని ప్రతి ఒక్కరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆయన మాటలు కేవలం సినిమా లోని పాత్రలను దర్శకుడిని మాత్రమే అవమానించినట్లుగా కాదని.
సినిమా ను చూసిన ప్రతి ఒక్కరిని కూడా అవమానించినట్లే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా నచ్చితేనే ప్రేక్షకులు చూడాలని అనుకుంటారు, సినిమా గురించి తెలియని వారు చూసి పాజిటివ్ టాక్ చెప్తేనే మరి కొందరు వెళ్తారు.పాజిటివ్ టాక్ సినిమా గురించి చెప్పారు అంటే వారికి నచ్చినట్లే, సినిమా నచ్చిన వారిని కూడా వెంకటేష్ మహా తన వ్యాఖ్యలతో అవమానించారు.సినిమాలు తీయడం చేత కాకపోతే వదిలేయాలి.
ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయితే కొత్తగా ప్రయత్నించాలి.అంతే కానీ హిట్ అయిన సినిమాలను అవమానిస్తూ, హిట్ చేసిన ప్రేక్షకులను అవమానిస్తూ వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే వెంకటేష్ మహా కి అర్థమైంది.
కోట్లాది మంది ప్రేక్షకులను అవమానించిన వెంకటేష్ మహా ఇప్పటికే క్షమాపణ చెప్పాడు.కనుక వివాదం సర్దుమణుగుతుందేమో చూడాలి.
ముందు ముందు నోటిని అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.







