ప్లాస్టిక్ యావత్ ప్రపంచానికే హానికరంగా మారుతోందని ఎప్పటినుండో నిపుణులు హెచ్చరిస్తున్నా దాని వాడకం అంతకంతకూ పెరుగుతుందే తప్ప, తగ్గడంలేదు.అంతెందుకు మనం కూడా ప్లాస్టిక్ కవర్ లేనిదే బజారులో అడుగు పెట్టం.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించినప్పటికీ అది నామమాత్రపు చర్యగానే మిగిలి పోతోంది.ఇకపోతే ప్లాస్టిక్ పదార్ధాలు చాలావరకు కార్సినో జెనిక్ అని మనందరికీ తెలిసిందే.
అంటే ప్లాస్టిక్ లేదా, వాటి కలయిక వల్ల తయారయ్యే పదార్థాల్లో ఉన్న ఆహారాన్ని దీర్ఘకాలం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెబుతారు.లోహాల వాడకంలో ఓ సరికొత్త విప్లవంగా పుట్టుకొచ్చిన ప్లాస్టిక్, మానవాళి జీవితాన్ని సులభతరం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించింది.
ఈ క్రమంలో మనిషి జీవితంలో అవసరమైన ఓ వస్తువు ఐపోయింది.కానీ దీనికరణంగా ముందు తరాలకు తీరని నష్టం వాటిల్లనుంది.పర్యావరణ హాని అటుంచితే, ప్లాస్టిక్ అవశేషాలు కడుపులోకి వెళ్తే జీర్ణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది.

ఇది కేవలం మనుషులకే కాదు జంతువులు, పక్షులకు కూడా హానికరం.సహజంగా పక్షుల జీర్ణ వ్యవస్థ చాలా దృఢంగా ఉంటుంది.అందుకే అవి రాళ్లను తిని కూడా అరిగించుకోగలవు.
ఇపుడు అలంటి పక్షులకే ముప్పు వాటిల్లుతోందంటే మీరు నమ్ముతారా? అవును, ప్లాస్టిక్ ని పక్షులు కడుపులోకి తీసుకోవడం వలన చాలా ప్రాణాంతకర వ్యాధులు సోకుతున్నాయి.దాని పేరే ప్లాస్టికోసిస్.
ప్లాస్టిక్ వ్యర్థాలు కడుపులోకి వెళ్లి పక్షులు వేల సంఖ్యలో ఇపుడు మృత్యువాత పడుతున్నాయి అని నిపుణులు చెబుతున్నారు.

లండన్ లోని నేచురల్ హిస్టరీ మ్యూజియం సైంటిస్ట్ లు దీనిపై విస్తృత పరిశోధనలు చేసి ప్లాస్టికోసిస్ మూలాలు, పర్యవసానాలు కనుగొన్నారు.ఈ భూమి మీద మనుషులు వినియోగించిన ప్లాస్టిక్ లో అతి కొద్దిగా మాత్రమే రీసైకిల్ అవుతోంది.మిగతాదంతా జలచరాల వద్దకు చేరుకుంటోంది.దాంతో పక్షులు, జంతువులు నష్టపోతున్నాయి.అయితే ఇది కేవలం వాటికీ మాత్రమే కాదు… మనుషులకు కూడా ముప్పే.ఇలానే కొనసాగితే, భవిష్యత్ తరాలు మరింత ప్రమాదంలో పడతాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.







