ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికుల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం మార్చి 12వ తారీఖున అంగరంగ వైభవంగా అమెరికా లో జరగబోతున్న విషయం తెలిసిందే.భారత కాలమానం ప్రకారం మార్చి 13వ తారీకు తెల్లవారు జామున ఆస్కార్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరగబోతుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ అవార్డు వేడుకలను దాదాపు 150 కోట్ల మంది వీక్షించబోతున్నట్లుగా తెలుస్తోంది.అనేక చానల్స్ లైవ్ ఇవ్వడం తో పాటు ప్రముఖ ఓటీటీ లు కూడా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నాయి.
ఆస్కార్ అవార్డు వేదిక పై ఒక్క నిమిషం కనిపిస్తే చాలని ఎంతో మంది నటీనటులు కోరుకుంటుంటారు.అలాంటి అవకాశం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి దక్కింది.

నాటు నాటు పాట కు స్టేజ్ పై… అది కూడా ఆస్కార్ అవార్డులు ప్రధానం చేసే స్టేజ్ పై పర్ఫామెన్స్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు దాదాపు మూడు నిమిషాల పాటు స్టేజ్ పై సందడి చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ అరుదైన అవకాశం తో ఇండియా లో ఏ స్టార్స్ కి దక్కని గౌరవం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు దక్కబోతోంది.రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నాటు నాటు పాటకి సినిమా లో వేసిన స్టెప్స్ మాదిరిగానే అద్భుతమైన స్టెప్స్ తో సందడి చేయబోతున్నారు.
సినిమా లో వారు వేసిన స్టెప్స్ కి మంచి స్పందన రావడంతో ఆస్కార్ వేదికపై కూడా వీరిద్దరూ డాన్స్ తో కన్నుల విందు చేయబోతున్నారు.వీరిద్దరు మాత్రమే కాకుండా రాహుల్ సిప్లిగంజ్ కూడా ఆస్కార్ అవార్డులు ప్రధానం చేసే స్టేజ్ పై నాటు నాటు పాటతో అలరించబోతున్నారు.
తన గాత్రం తో మరో సారి మెస్మరైజ్ చేసేందుకు అమెరికా చేరుకున్నాడు.మొత్తానికి ఈసారి ఆస్కార్ అవార్డు వేడుకలు ఇండియన్స్ కు ముఖ్యంగా తెలుగు వారికి అత్యంత కీలకం.







