దర్శకులు సుకుమార్ చేతుల మీదుగా (NVL) ఆర్ట్స్ “రుద్రమాంబపురం” చిత్ర ట్రైలర్ విడుదల !!!

ఎన్‌వీఎల్ ( NVL )ఆర్ట్స్( NVL Arts ) ప‌తాకంపై నండూరి రాము నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం( Rudramambapuram ).మ‌హేష్ బంటు ద‌ర్శ‌కత్వం వహించిన ఈ సినిమాకు మూల కథ అజయ్ ఘోష్.

 Director Sukumar Launched Nvl Arts Rudramambapuram Movie Trailer-TeluguStop.com

శుభోద‌యం సుబ్బారావు, అజయ్ ఘోష్, అర్జున్ రాజేష్, పలాస జనార్దన్, నండూరి రాము, టివి.ఎయిట్ సాయి, శంకర్, డివి.

సుబ్బారావు, ప్రమీల, రజిని శ్రీకళ, రత్నశ్రీ, షెహనాజ్, రజిని, సురేఖ, రమణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం `రుద్ర‌మాంబ‌పురం`.మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌.

జులై 6 నుండి ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది.

దర్శకులు మారుతి గారు ఈ చిత్ర టీజర్( Rudramambapuram Teaser ) ను ఇటీవల విడుదల చేశారు, విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి ఆదరణ లభించింది.

అలాగే జాతర సాంగ్ ను ఇటీవల హీరో శ్రీకాంత్ గారు విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను దర్శకులు సుకుమార్ గారు విడుదల చేసారు.

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ…
(NVL) ఎన్.వి.ఎల్.ఆర్ట్స్ పతాకంపై నిర్మాత నండూరి రాము( Producer Nanduri Ramu ) నిర్మించిన చిత్రం రుద్రమాంబపురం, ములవాసుల కథ.ఇది మత్స్యకారుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాతో యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను, ఈ సినిమాకు అజయ్ ఘోష్ కథ అందించడం విశేషం, ట్రైలర్ బాగుంది సినిమా కూడా ఇదే తరహాలో విజయం సాధించాలని, చిత్ర యూనిట్ సభ్యులకు మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఈ చిత్రంలో తిరుపతి పాత్ర లో అజయ్ గోష్( Ajay Gosh ), నటిస్తున్నారు, పెద్ద‌కాపు మ‌ల్లోజుల శివ‌య్య పాత్ర‌లో శుభోద‌యం సుబ్బారావు న‌టిస్తున్నారు.

వెంగీ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, బొంతల నాగేశ్వ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌.వెంక‌టేశ్వ‌ర‌రావు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
నిర్మాత‌: నండూరి రాము
ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బంటు
బ్యాన‌ర్: ఎన్‌వీఎల్ ఆర్ట్స్
క‌థ‌: అజ‌య్ ఘోష్
డిఓపి: ఎన్ సుధాక‌ర్ రెడ్డి
సంగీతం: వెంగీ
ఎడిట‌ర్‌: బొంత‌ల నాగేశ్వ‌ర్ రెడ్డి,
ఆర్ట్‌: వెంక‌టేశ్వ‌ర రావు
ఫైట్స్‌: దేవ‌రాజు
కో- ప్రొడ్యూస‌ర్‌: డి న‌రసింహ‌మూర్తి రాజు
సీఈఓ: అనింగి రాజ‌శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కారెడ్ల బాలాజీ శ్రీ‌ను
కొరియోగ్రఫీ: జో జో మాస్టర్
పీఆర్ఓ: శ్రీధర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube