ఎట్టకేలకు శ్రీను వైట్లకు స్టార్ దొరికాడోచ్.. ఆ యాక్షన్ హీరోతో నెక్స్ట్ మూవీ!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో శ్రీను వైట్ల ఒకరు.ఈయన చాలా సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.అయితే గత కొన్నేళ్లుగా ఈయన కెరీర్ డౌన్ అయ్యింది.వరుస సినిమాలు ప్లాప్ అవుతూ వస్తుండడంతో ఏ హీరో అవకాశం ఇవ్వడం లేదు.ఇక స్టార్ హీరోలు అవకాశం ఇవ్వక పోవడంతో ఈయన ప్రెజెంట్ యంగ్ హీరో మంచు విష్ణు తో సినిమా చేస్తున్నాడు.

 Director Sreenu Vaitla Announces His Next With Gopichand, Director Sreenu Vaitla-TeluguStop.com

శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబోలో వచ్చిన ఢీ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా డిడి (డబుల్ డోస్) అనే సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు.ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

 Director Sreenu Vaitla Announces His Next With Gopichand, Director Sreenu Vaitla-TeluguStop.com

ఈ సినిమాతో తనని తాను నిరూపించు కోవాలని శ్రీను వైట్ల ఆరాట పడుతున్నారు.మరి ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో చూడాలి.
ఇది పక్కన పెడితే ఈయన నెక్స్ట్ సినిమా గురించి నిన్న పండుగ వేళ అప్డేట్ ఇచ్చాడు.శ్రీను వైట్ల యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడు అని అఫిషియల్ గా తెలిపాడు.

గోపీచంద్ కూడా అంతగా హిట్స్ సాధించడం లేదు.ఇటీవలే పక్కా కమర్షియల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.ఇక ఇప్పుడు గోపీచంద్, శ్రీను వైట్ల కాంబోలో ఒక సినిమా రాబోతుంది.

Telugu Dhee, Dhee Sequel, Sreenu Vaitla, Sreenuvaitla, Gopichand, Vishnu Manchu-

ప్రెజెంట్ గోపీచంద్ లక్ష్యం డైరెక్టర్ శ్రీవాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ క్రమంలోనే శ్రీను వైట్లతో మరో సినిమా ప్రకటించాడు.ఈ సినిమాలో గోపిమోహన్ కూడా భాగం అవ్వనున్నారు.శ్రీనువైట్ల, గోపిమోహన్ కలిసి పనిచేసినప్పుడల్లా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.అందుకే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.మరి ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్ త్వరలోనే అందిస్తానని చెప్పుకొచ్చాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube