నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ మూడు సినిమాలతో డైరెక్టర్ గా తన మార్క్ సెట్ చేసుకున్న శివ నిర్వాణ( Shiva Nirvana ) మొదటి రెండు సినిమాలు హిట్ కొట్టగా థర్డ్ మూవీ టక్ జగదీష్ అంచనాలను అందుకోలేదు.లేటెస్ట్ గా విజయ్ దేవరకొండతో ఖుషి ( Khusi Movie ) అంటూ ఒక లవ్ స్టోరీతో వస్తున్నాడు.
విజయ్ దేవరకొండx సమంతShiva Nirvana లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ కి భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
సినిమాకు శివ నిర్వాణ 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నాడట.

టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న డైరెక్టర్స్ కి ఈక్వల్ గా శివ రెమ్యునరేషన్( Shiva Nirvana Remuneration ) ఉంది.అయితే శివ నిర్వాణ ఖుషి సినిమాకు సాంగ్స్ కూడా అందించాడు.సో అలా కూడా సినిమాకు హెల్ప్ అయ్యాడు.
డైరెక్షన్ తో పాటుగా సాంగ్స్ రాసినందుకు శివ నిర్వాణకు 12 కోట్ల దాకా పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తుంది.శివ నిర్వాణ ఖుషి హిట్ పడితే మాత్రం అతను నిజంగానే స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే లెక్క.







