గేమ్ ఛేంజర్ డైరెక్టర్ గా శైలేష్ కొలను... ఒక్క ఫోటోతో ఖండించిన డైరెక్టర్ శంకర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ramcharan Tej ) ప్రస్తుతం శంకర్ (Shankar) డైరెక్షన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.అయితే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో అనుకోకుండా ఇండియన్ 2( Indian 2 ) సినిమా షూటింగ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో తప్పనిసరి పరిస్థితులలో శంకర్ ఈ సినిమాకి కొద్ది రోజులు భారతీయుడు 2 సినిమాకి కొద్ది రోజులు షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.

 Director Shankar Joins Game Changer Movie Action Scenes,ram Charan,shankar,saile-TeluguStop.com

ఇక రాంచరణ్ తన వ్యక్తిగత విషయాల కారణంగా కొద్దిరోజులపాటు సినిమాలో షూటింగుకు దూరంగా ఉన్న విషయం మనకు తెలిసిందే .అయితే తిరిగి ఈయన తన సినిమా షూటింగ్ పనులలో పాల్గొన్నారు.ఇకపోతే ఈ సినిమా షూటింగు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.శంకర్ భారతీయుడు 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయనకు గేమ్ ఛేంజర్ షూటింగ్ చేయడానికి కుదరలేదని అందుకే శంకర్ పర్యవేక్షణలో హిట్ సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను ( Director Sailesh Kolanu ) ఈ సినిమాలోని కొన్ని యాక్షన్స్ సన్ని వేషాలకు దర్శకత్వం వహించబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ విధంగా గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer ) షూటింగ్ కు సంబంధించి ఇలాంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో డైరెక్టర్ శంకర్( Director Shankar ) ఈ వార్తలను ఖండిస్తూ ఒక్క ఫోటోతో అందరికీ క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఈయన సోషల్ మీడియా వేదికగా తాను గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నానంటూ,ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎవరి ప్రమేయం లేదని అర్థం వచ్చేలా ఒక ఫోటోని షేర్ చేశారు.దీంతో ఈ సినిమా గురించి వస్తున్నటువంటి వార్తలకు పూర్తిగా పులిస్టాప్ పడింది.ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రామ్ చరణ్ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు.

అయితే ఈ వార్తలలో నిజం లేదని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube