పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ప్రస్తుతం సినిమా లతో బిజీగా ఉన్నాడు.మరో వైపు రాజకీయ వ్యవహారాలు చూసుకుంటూ ఇప్పుడు బిజీ బిజీగా ఉంటున్నాడు.
ఇంత బిజీ సమయం లో తన కుటుంబ సభ్యుల యొక్క పుట్టిన రోజులను కూడా పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సారి పట్టించుకునే పరిస్థితి ఉండదు.అలాంటి పవన్ కళ్యాణ్ దర్శకుడు నటుడు సముద్ర ఖని యొక్క పుట్టిన రోజుకు ప్రత్యేకంగా ప్రెస్ నోట్ విడుదల చేయడం అందులో.
మా బంగారు గని అంటూ సంబోధిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం ఆశ్చర్యంగా, విడ్డూరంగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ కి నచ్చితే ఇలాగే ఉంటుంది.
పవన్ ఎవరిని వెంటనే నమ్మడు.కానీ నమ్మితే వారిని ఆకాశానికి ఎత్తుతాడు.
వారిపై ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉంటాడు.అలా పవన్ కళ్యాణ్ కి నమ్మకస్తుల్లో కొద్ది మంది మాత్రమే ఉంటారు.
ఇప్పుడు ఆ జాబితా లో ఈ స్టార్ నటుడు కం డైరెక్టర్ ఆయన సముద్ర ఖని( Samuthirakani ) నిలిచినట్లుగా తెలుస్తోంది.వీరిద్దరి కాంబినేషన్ లో వినోదయ సీతమ్ రీమేక్( Vinodhaya Sitham ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ను తెలుగు లో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్( Sai Dharam Tej ) కలిసి నటించారు.
ఒరిజినల్ వర్షన్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని రీమేక్ కి కూడా దర్శకత్వం వహించాడు.మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా యొక్క రచన వ్యవహారాలు చూసుకున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.పవన్ కళ్యాణ్ నుండి అద్భుతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్న దర్శకుడు సముద్ర ఖని ఆనందంతో గంతేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.నిజంగా సముద్ర ఖని చాలా అదృష్టవంతుడు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్న దర్శకుడు ఆయన నుండి ఇలాంటి శుభాకాంక్షలను అందుకోవడం గొప్ప విషయం అన్నట్లుగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వినోదయ్య సీతమ్ రీమేక్ హిట్ అయితే ముందు ముందు మరిన్ని సినిమాలు వీరి కాంబోలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.