దర్శకుడు రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల కాంబినేషన్‌లో నూతన చిత్రం ప్రారంభం

మత్తు వదలరా చిత్ర దర్శకుడు రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఓ నూతన చిత్రం ప్రారంభమైంది.అగ్ర కథానాయకులతో, స్టార్ డైరక్టర్లతో సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీమేకర్స్, ఇటీవల మత్తు వదలరా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించిన క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 Director Ritesh Rana Lavanya Tripathi With Mythri Movie Makers Movie Grandly Lau-TeluguStop.com

మత్తు వదలరా దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ కథానాయిక లావణ్య త్రిపాఠి హీరోయిన్.

నరేష్ ఆగస్త్య, వెన్నెల కిషోర్, సత్య ముఖ్యతారలుగా నటిస్తున్న ఈ కామెడీ థ్రిల్లర్చిత్రానికి చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మాతలు.

నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పకులు.ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత గుణ్ణం గంగరాజు కెమెరా స్వీచ్చాన్ చేయగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి గారు క్లాప్ నిచ్చారు.ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ముహుర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు.యువ సంగీత దర్శకుడు కాలభైరవ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి సురేష్ సారంగం ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Telugu Ritesh Rana, Koratala Siva, Mythri Makers, Rajamouli-Movie

లావణ్య త్రిపాఠి, నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్, ఫైట్స్: శంకర్ ఉయ్యాల, లైన్ ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయికుమార్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కేవీవీ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube