ఈ ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడు ఎవరో తెలుసా.. ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ డైరెక్టర్?

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది.కేవలం తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మిగిలిన అన్ని ఇండస్ట్రీలలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది.

అన్ని భాషలకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్స్,పలువురు సెలబ్రిటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియా లో సెలబ్రిటీలకు సంబంధించిన చిన్నప్పటి ఫోటోలు షేర్ చేస్తూ.

ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి చూద్దాం అంటూ ఈ పోస్టులు పెడుతున్నారు.ఇప్పటికే ఎంతో మంది హీరో,హీరోయిన్లు, సెలబ్రెటీలు ఫోటోలు బయట అయిన విషయం తెలిసిందే.

తాజాగా మీడియాలో ఒక వ్యక్తి చిన్నప్పటి ఫోటో వైరల్ అవుతుంది.అయితే ఆ వ్యక్తి ఎవరా అని నెటిజన్స్ ఆరా తీశారు.

Advertisement

ఆ ఫొటోలో ఉన్న అబ్బాయి మరెవరో కాదు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.తరచూ ఏదో ఒక వివాదంతో ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు రామ్ గోపాల్ వర్మ.

మొదట శివ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాంగోపాల్ వర్మ మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు.

ఈ నేపథ్యంలోనే రక్త చరిత్ర, దెయ్యం, సత్యం, వంటి ఫ్యాషన్ ఫాంటసీ చిత్రాలను ప్రకటించారు.ఇక సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీలు ద్వారానే రామ్ గోపాల్ వర్మ బాగా పాపులర్ అయ్యారు.ఎవరు ఏమనుకున్నా ఎన్ని అన్నా కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటారు.

సినిమాల పరంగా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ, నిజజీవిత సంఘటనలు తెరకెక్కిస్తూ కాంట్రవర్సీల చుట్టూ తిరుగుతూ ఉంటాడు.కొన్ని కొన్ని సార్లు రామ్ గోపాల్ వర్మ తనకు సంబంధం లేని విషయాల గురించి కూడా స్పందిస్తూ ట్రోలింగ్స్ కి గురవుతూ ఉంటారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు