తెలుగు సినిమా స్థాయి ని అంతర్జాతీయ స్థాయి కి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి( Director Rajamouli ) బాహుబలి సినిమా తో తెలుగు సినిమా రేంజ్ ఏంటో బాలీవుడ్ ఇండస్ట్రీ కి తెలియజేసిన రాజమౌళి ఇక ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా( RRR Movie )తో ఏకంగా గ్లోబల్ డైరెక్టర్ గా పేరు దక్కించుకొని ఆ సినిమాతో ఏకంగా ఆస్కార్ దక్కించుకున్నారు అంటే ఇక ఏ రేంజ్ లో ఆయన తన పర్ఫామెన్స్ అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.ఒక టాలీవుడ్ లోనే అతిపెద్ద దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన ఇప్పుడు మరింత పాపులారిటీ దక్కించుకున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాతో అన్ని దేశాలలో తన పేరు మారుమ్రోగేల చేశారు…
అప్పుడప్పుడు సినిమాలలో కనిపించే రాజమౌళి ఇప్పటివరకు ఒక యాడ్ లో కూడా నటించలేదు.కానీ తొలిసారి ఆయన ఒక ప్రముఖ మొబైల్ కంపెనీ( Mobile Company ) కోసం యాడ్లో నటించడం జరిగింది.ఇక ఈ యాడ్ షూటింగ్ రాజస్థాన్ లో జరగడం గమనార్హం.రాజస్థాన్( Rajsthan ) కి కుటుంబంతో కలిసి వెళ్లిన రాజమౌళి అక్కడ యాడ్ షూట్ తో పాటు వెకేషన్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చాలా వైరల్ గా మారాయి.ఇదిలా ఉండగా మొదటిసారి చేసిన యాడ్ కోసం రాజమౌళి ఎంత పారితోషకం తీసుకున్నారు అన్నది ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది…
సాధారణంగా ఒక్కొక్క సినిమాకు తన రేంజ్ ను బట్టి రూ.150 కోట్ల వరకు పారితోషకం( Rajamouli Remuneration for Ad ) తీసుకుంటున్నారు అన్న వార్త వినిపిస్తూ ఉండగా.ఇక యాడ్ కోసం కూడా ఆయన భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.
ఈ యాడ్ కోసం రాజమౌళి ఏకంగా మూడు కోట్ల రూపాయల రేంజ్ లో అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే ఈ యాడ్ రీసెంట్గా టెలికాస్ట్ అవ్వగా అందులో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు రాజమౌళి…ప్రస్తుతం ఆయన రేంజ్ కి తగ్గట్టుగా సంపాదించే పనిలో పడ్డ రాజమౌళి ఇలా యాడ్స్ కూడా చేస్తూ భారీగానే సొంతం చేసుకుంటున్నారని చెప్పవచ్చు…
.