రావణుని లుక్ ను అందుకే అలా డిజైన్ చేశాం.. ఓం రౌత్ క్లారిటీ ఇదే!

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాతో ఇతర భాషల ప్రేక్షకులకు సైతం దగ్గర కావాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమా విషయంలో ఓం రౌత్ పై దారుణంగా ట్రోలింగ్ జరిగింది.

 Director Om Raut Clarity About Ravan Look Details Here Goes Viral,director Om Ra-TeluguStop.com

ఈ మధ్య కాలంలో ఏ దర్శకుడిపై ఈ స్థాయిలో ట్రోలింగ్ జరగలేదు.ముఖ్యంగా హనుమంతుని, రావణాసురుని లుక్ విషయంలో నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఆదిపురుష్ వివాదాలకు సంబంధించి తాజాగా ఓం రౌత్ మరోసారి స్పందించి క్లారిటీ ఇచ్చారు.రావణుడు క్రూరత్వం కలిగిన వ్యక్తి అని రావణుడు లుక్స్ తోనే క్రూరత్వాన్ని చూపించాల్సి ఉంటుందని రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణంలో భారీ ఆకారంలో చూపించారని ఓం రౌత్ అన్నారు.

 Director Om Raut Clarity About Ravan Look Details Here Goes Viral,director Om Ra-TeluguStop.com

భవిష్యత్తు తరాల వారు కూడా చూడాలనే ఆలోచనతో ఆదిపురుష్ మూవీని తెరకెక్కిస్తున్నామని ఓం రౌత్ తెలిపారు.

అందుకు అనుగుణంగానే రావణుడి లుక్ ను తీర్చిదిద్దామని ఓం రౌత్ వెల్లడించారు.భయంకరమైన పక్షిపై రావణుడు ప్రయాణిస్తున్న విధంగా టీజర్ లో చూపించామని ఓం రౌత్ కామెంట్లు చేశారు.95 సెకన్ల వీడియోను చూసి ఆదిపురుష్ మూవీ గురించి ఒక ఒపీనియన్ కు రావద్దని ఓం రౌత్ అన్నారు.హనుమంతుడు లెదర్ దుస్తులు ధరించాడని కొంతమంది చేస్తున్న కామెంట్లలో నిజం లేదని ఓం రౌత్ తెలిపారు.

ఈ సినిమా కోసం ఎలాంటి లెదర్ దుస్తులను వినియోగించలేదని ఓం రౌత్ తెలిపారు.ఓం రౌత్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

రికార్డ్ స్థాయి స్క్రీన్లలో పది కంటే ఎక్కువ భాషలలో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.కొంతమంది మాత్రం ఆదిపురుష్ సక్సెస్ సాధిస్తుందని కాన్ఫిడెన్స్ ను కలిగి ఉన్నారు.

Director Om Raut Clarity About Ravan Look Details Here Goes Viral,director Om Raut,aadipurush, Ravan Look,director Om Raut Clarity ,Ramanand Sagar - Telugu Aadipurush, Om Raut, Ramanand Sagar, Ravan #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube