గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ల గ్రామంలో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు తానేటి వనిత గారు పర్యటించారు.వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు గురించి వివరించారు.
అర్హులైన లబ్ధిదారులకు అమ్మవడి, చేయూత, ఆసరా, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నాయా.లేదా.
అని హోంమంత్రి వనిత గారు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన తేదీకి బటన్ నొక్కి తమ అకౌంట్ లో నగదు జమ చేస్తున్నారని లబ్ధిదారులు సంతోషంతో హోంమంత్రి కి తెలిపారు.
గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ఒకటవ తేదీన టక్కున పెన్షన్లు అందుతున్నాయన్నారు.గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజలందరీ ఆశీస్సులు ఉండాలని హోంమంత్రి గారు అన్నారు.
తిరుగుడుమెట్ల గ్రామంలో ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని హోంమంత్రి తానేటి వనిత గారు సూచించారు
.