స్టార్ డైరెక్టర్ మణిరత్నం( Director Maniratnam ) డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్.ఇప్పటికే ఈ సినిమా పార్ట్ 1 గా విడుదల కాగా ఈరోజు పార్ట్ 2 తో( Ponniyin Selvan 2 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమాలో.విక్రమ్( Vikram ), ఐశ్వర్యరాయ్( Aishwarya Rai ), జయం రవి, కార్తీ, త్రిష, వంటి స్టార్ నటులతో పాటు శోభిత, ప్రభు, ఆర్.శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, ఆర్.పార్తిబన్ తదితరులు నటించారు.ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థపై మణిరత్నం, శుభస్కరన్ అల్లి రాజా నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించాడు.ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమా తమిళం తో పాటు హిందీ, కన్నడ, తెలుగు, మలయాళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడంతో.
ప్రేక్షకులను ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
కథ విషయానికి వస్తే 10వ శతాబ్దంలో చోళరాజుల నేపథ్యంలో రూపొందింది.ఇక పార్ట్ వన్ లో అరుల్మోజి (జయం రవి), వల్లవరాయన్ (కార్తి) సముద్రంలో జరిగిన యుద్ధంలో మరణించినట్లు చూపించగా.ఎక్కడైతే కథను ముగించారో అక్కడి నుంచి రెండో భాగాన్ని ప్రారంభించారు.
ఇక సినిమా ప్రారంభంలోని చిరంజీవి వాయిస్ ఓవర్ తో పరిచయం అవుతుంది.బౌద్ధులు వల్లవరాయన్ వీర పాండ్యన్ హత్యకు కారణమైన ఆదిత్య పై ప్రతీకారం తీర్చుకోవడానికి.
అంతేకాకుండా అరుణ్ మౌళి, నందిని, పాండియన్ సమూహాలను కాపాడటం కోసం మధురాంతకన్, అతని శివ భక్త అనుచురలు చోళ సింహాసనాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో వారి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.అలా చివరికి ఆదిత్య, నందిని ఏమయ్యారు.
మధురాంతకన్ సింహాసనాన్ని పొందుతాడా లేదా అనేది మిగిలిన కథలో చూడాల్సిందే.
నటినటుల నటన:
నటీనటుల నటన విషయానికి వస్తే.ఇందులో నటించిన స్టార్ నటుల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రతి ఒక్కరు తమ పాత్రకు పూర్తి న్యాయంతో అందులో లీనమయ్యారని చెప్పాలి.
ముఖ్యంగా ఐశ్వర్యరాయ్, విక్రమ్ నటించిన సన్నివేశలు హైలైట్ గా కనిపించాయి.ఐశ్వరరాయ్ నందిని, మందాకిని అనే రెండు పాత్రలలో అద్భుతంగా నటించింది.
కార్తీ, త్రిష అద్భుతంగా చేశారు.మిగతా నటీనటులంత తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ మణిరత్నం అందించిన కథ అద్భుతంగా ఉంది.పాత్రలకు తగ్గట్టు నటీనటులను ఎంచుకోవడంలో ప్లస్ పాయింట్ అని చెప్పాలి.ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా ఉంది.మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ:
డైరెక్టర్ మణిరత్నం పార్ట్ 2 ను కూడా అద్భుతంగా చూపించాడు అని చెప్పాలి.అక్కడక్కడ సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించిన కూడా బోరింగ్ లేకుండా చూపించాడు.ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా చూపించాడు.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథ, నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ, ఇంటర్నెట్.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసినట్లు అనిపించింది.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.క్లైమాక్స్ లో మరింత శ్రద్ధ పెడితే బాగుండేది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా ఆడియన్స్ కు కచ్చితంగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి.