'తమసోమ జ్యోతిర్గమయ' ట్రైలర్ ని చూస్తే 'వేదం' సినిమా గుర్తొస్తుంది! - డైరెక్ట‌ర్ క్రిష్‌

`తమసోమ జ్యోతిర్గమయ` ట్రైలర్ ని చూస్తే వేదం సినిమా గుర్తొస్తుందని అన్నారు సృజ‌నాత్మ‌క‌ ద‌ర్శ‌కుడు క్రిష్ జాగర్లమూడి.

చక్కటి మాటలతో కనివిందు చేసే గ్రామీణ దృశ్యాలతో.

చేనేత, చేతి వృత్తులలో ప్రత్యేకంగా యువతలో సామాజిక స్పృహను కల్పించే విధంగా ఈ సినిమాని తెర‌కెక్కించార‌ని అన్నారు.ట్రైలర్ లో ``ఊరుని నేను చూస్తున్నట్టు లేదు, ఊరే నన్ను చూస్తున్నట్టు చెప్పే మాట మనలో కొత్త ఆలోచనల్ని కలిగిస్తుంది`` అని ఆయ‌న ప్ర‌శంసించారు.

`తమసోమ జ్యోతిర్గమయ- ఒక నేత కథ` ట్రైల‌ర్ ఆవిష్క‌ర్త క్రిష్.విజువ‌ల్స్ ఆద్యంతం ఆక‌ట్టుకున్నాయ‌ని అన్నారు.

ఆనంద్ రాజ్ బేతి, శ్రావణి సెట్టి, జనార్దన్, ఆర్కే త‌దిత‌రులు న‌టించారు.విజయ్ కుమార్ బడుగు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Advertisement

ఆయ‌నే ర‌చ‌యిత‌.అక్టోబర్ 29న ఈ సినిమా విడుద‌ల‌వుతోంది.

గుణాస్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో విమల్ క్రియేషన్స్ బ్యానర్ పై త‌డ‌క ర‌మేష్ నిర్మించారు.

ప్రశాంత్ బిజె సంగీతం అందించ‌గా.సాయి కార్తీక్ గౌడ్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌.ఈ చిత్రానికి DOP- ఎడిటింగ్- DI-శ్రావణ్ జి కుమార్.

సాహిత్యం - పెద్దింటి అశోక్ కుమార్, ప్రశాంత్ BJ, సాయి చరణ్, రంజని శివ కుమార్.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు