పవన్ కళ్యాణ్ స్థానంలో గోపీచంద్.. దర్శకుడు క్రిష్ మరో భారీ తప్పు చేయబోతున్నారా?

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) తెరకెక్కుతుండగా ఈ సినిమా థియేటర్లలో ఎప్పుడు విడుదలవుతుందో తెలియడం లేదు.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అవుతుండటంతో క్రిష్( Director Krish ) విలువైన సమయం వృథా అవుతోంది.

అందువల్ల క్రిష్ గోపీచంద్ సినిమాపై దృష్టి పెడుతున్నారని సమాచారం అందుతోంది.పవన్ కళ్యాణ్ కు బదులుగా గోపీచంద్ తో సినిమా చేయడానికి క్రిష్ భావిస్తున్నారని తెలుస్తోంది.

అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.దర్శకుడు క్రిష్ గోపీచంద్ తో సినిమా తీసి సక్సెస్ సాధిస్తే సమస్య లేదు కానీ ఆ సినిమా ఫ్లాపైతే మాత్రం క్రిష్ కెరీర్ పై ఎఫెక్ట్ పడుతుందని చెప్పవచ్చు.

దర్శకుడు క్రిష్ మరో భారీ తప్పు చేయబోతున్నారా? అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

Advertisement

పవన్ క్రిష్ కాంబో మూవీ విడుదలవ్వాలంటే ఏడాది లేదా రెండేళ్లు ఆగాల్సి ఉంటుందని కొంతమంది ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ ప్రాజెక్ట్ విషయంలో రాబోయే రోజుల్లో ఎం జరుగుతుందో చూడాల్సి ఉంది.పవన్ నుంచి సైతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ సినిమా వల్ల నిర్మాతపై ఊహించని స్థాయిలో భారం పెరుగుతోందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

గోపీచంద్( Gopichand ) ప్రస్తుతం శ్రీనువైట్ల( Srinu Vaitla ) డైరెక్షన్ లో నటిస్తుండగా ఈ సినిమా పూర్తైన తర్వాత క్రిష్ డైరెక్షన్ లో నటిస్తారేమో చూడాల్సి ఉంది.క్రిష్ ఇకపై వేగంగా సినిమాలు తీయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఇతర భాషల్లో సైతం క్రిష్ సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.

డైరెక్టర్ క్రిష్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు