హరిష్ సజ్జా దర్శకత్వంలో రూపొందిన సినిమా టాక్సీ.వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు చేశారు.
ఇక ఈ సినిమాకు మార్క్ కే రాబిన్ సంగీతం అందించాడు.ఉరుకుండా రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టాడు.
ఇక ఈ సినిమాను హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు.అయితే ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులలో భారీ అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటో చూద్దాం.
కథ:
వసంత్ సమీర్ పిన్నమ రాజు ఈశ్వర్ అనే పాత్రలో సైంటిస్ట్ గా కనిపిస్తాడు.అలా ఈశ్వర్ కాలిఫోర్నియం 252 పై ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతాడు.దానిని దేశం కోసం ఉపయోగించాలనుకుంటాడు.దీనివల్ల కాలిఫోర్నియం 252 తో బంగారం నిల్వలు కనిపెట్టవచ్చని.ఎక్కడో భూమి లోతుల్లో ఉన్న బంగార నిల్వల అంతు తేల్చచ్చని.
అప్పుడు దేశం నెంబర్ వన్ అవుతుంది అని గనుల శాఖా మంత్రికి తెలుపుతాడు.అంతేకాకుండా ఇంకా మరిన్ని ప్రయోగాలు కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫైనాన్సియల్ సపోర్ట్ ఇవ్వమని కోరుతాడు.
అయితే కాలిఫోర్నియం 252 ఒక్కో గ్రాము 180 కోట్లు.అంతటి విలువైన సంపదను ఎవరు వదులుకుంటారని.
పొలిటీషన్స్, వారిని అంటిపెట్టుకునే మాఫియా రంగంలోకి దూకుతుంది.దీంతో ఈశ్వర్ లాంటి నిజాయితీ పరుడుని వంచటం కష్టం.
అందుకే అతని పర్శనల్ లైఫ్ ని తమ గుప్పిట్లో తీసుకుంటే అనే ఆలోచన వస్తుంది.ఇక అక్కడ నుంచి ఈశ్వర్ పై నేరారోపణలు, అతని భార్య మిస్సింగ్ జరగటంతో.వాటి నుంచి తప్పించుకోటానికి ఈశ్వర్ రంగంలోకి దిగుతాడు.అదే సమయంలో ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) కు కాంట్రాక్ట్ వస్తుంది.అయితే అనుకోకుండా ఆ కాంట్రాక్టు సమస్యలు పడటంతో ప్రాజెక్టు ఆగిపోతుంది.దీంతో అప్పులు అవడంతో.
ఆ ఒత్తిడి నుంచి బయటపడటానికి ఒక నిర్ణయం తీసుకుంటాడు.అలా వేరువేరు సమస్యలతో చిక్కుకున్న ఈశ్వర్, ఉజ్వల్ అనుకోకుండా ఒక క్యాబ్ ఎక్కుతారు.
దీంతో ఆ క్యాబ్ పై కొందరు దాడి చేయగా వీళ్ళు అక్కడి నుంచి తప్పించుకుంటారు.అయితే ఈ దాడి చేయించింది విద్యుత్ (నవీన్ పండిత) అని తెలుస్తుంది.
ఇంతకు అతడు ఎవరు.వీళ్ళని ఎందుకు టార్గెట్ చేశాడు.
అసలు చివరికి తమ సమస్యల నుండి బయటకు పడతారా లేదా అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
నటీనటుల నటన విషయానికి వస్తే.వసంత్ సమీర్ తన పాత్రతో బాగా ఆకట్టుకున్నాడు.ఇక ఆయనకు భార్య పాత్రలు చేసిన అల్మాస్ కూడా బాగా ఫిదా చేసింది.మిగతా నటీనటులంతా పరవాలేదు అన్నట్టుగా చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా ఈ సినిమాకు డైరెక్టర్ మంచి కథను అందించాడు.మార్క్ కే రాబిన్ అందించిన పాటలు కూడా పరవాలేదు.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ:
ఈ సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది.యాక్షన్స్ సన్నివేశాలు, త్రిల్లింగ్ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.చాలావరకు డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా చూపించాడు.ఇద్దరు వ్యక్తులు తమ సమస్యలతో ఎలా బయటపడ్డారు అనే విధానాన్ని కూడా బాగా చూపించాడు.
ప్లస్ పాయింట్స్:
సినిమా కథ, నటీనటుల నటన, సంగీతం, యాక్షన్స్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కాస్త నెమ్మదిగా సాగింది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ను ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు.