రష్మిక అసలు హీరోయిన్ కాదు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరనే సంగతి తెలిసిందే.హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్న రష్మికకు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఫలితం షాకిచ్చింది.

 Director Hanu Raghavapudi Shocking Comments About Rashmika Goes Viral ,director-TeluguStop.com

అయితే పుష్ప2 సినిమాతో రష్మిక ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరుతుందని రష్మిక అభిమానులు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.అయితే స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి రష్మిక గురించి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

రష్మిక ప్రస్తుతం సీతారామం అనే సినిమాలో నటిస్తున్నారు.దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.స్వప్న దత్ నిర్మాతగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.రష్మిక ఈ మూవీలో కశ్మీర్ ముస్లిం అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు.

హీరోయిన్ రష్మిక పాత్ర పేరు అఫ్రీన్ కావడం గమనార్హం.సీతారామం మూవీలో రష్మిక మెయిన్ హీరోయిన్ అని ప్రచారం జరిగింది.

Telugu Dulquer Salman, Kashmiri, Sita Ramam-Movie

వైరల్ అవుతున్న ప్రచారం గురించి హను రాఘవపూడి స్పందిస్తూ సీతారామం మూవీ రష్మిక హీరోయిన్ కాదని హీరో అని చెప్పారు.సినిమాలోని ఆమె రోల్ ను స్పెషల్ గా డిజైన్ చేశామని హను రాఘవపూడి పేర్కొన్నారు.రష్మిక ఎంతో గ్రౌండ్ వర్క్ చేసి ఈ పాత్రలో నటించారని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.అఫ్రీన్ రోల్ కొరకు ఎంతోమంది హీరోయిన్లను పరిశీలించి చివరకు రష్మికను ఫైనల్ చేశామని ఆయన తెలిపారు.

రష్మిక కళ్లతోనే హావభావాలను ప్రదర్శిస్తారని ఈ సినిమాలో ఆమె నటనను చూసి తాను ఆశ్చర్యానికి గురయ్యానని ఆయన చెప్పుకొచ్చారు.రష్మిక ఈ పాత్రకు సరైన నటి అని ఈ సినిమాతో అర్థమైందని ఆయన పేర్కొన్నారు.

సీతారామం సినిమా కోసం హీరోయిన్ రష్మిక ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube