బోయపాటి శ్రీనునా అతనెవరు.. నాకు తెలీదు ఆ పేరు: సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

 Director Gita Krishna Shocking Comments On Director Boyapati Srinu Details, Boya-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.ఈ విధంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను అంటే ఎవరో తనకు తెలియదని షాకింగ్ కామెంట్ చేశారు నిన్నటితరం డైరెక్టర్ గీతాకృష్ణ.

నిన్నటితరం దర్శకులలో ఒకరుగా పేరు సంపాదించుకున్న గీతాకృష్ణ సుమారు అరడజనుకు పైగా సినిమాలు చేశారు.ఇందులో ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన కోకిల సినిమా ఒకటే చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా కథ పరంగానే కాకుండా మంచి మ్యూజికల్ హిట్ కూడా అందుకుంది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ గీత కృష్ణ బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉందని అయితే అందులో నటించిన కుర్రాడు ఆ సినిమాకు సరిపడే హీరో కాదు అంటూ కామెంట్ చేశారు.

Telugu Boyapati Srinu, Chiranjeevi, Gita Krishna, Geetha Krishna, Ram Charan, Te

నిజం మాట్లాడాలంటే బోయపాటి శీను ఎవరో నాకు తెలియదు అని కేవలం తన కొడుకు సినిమాకి డైరెక్టర్ కావాలనే ఉద్దేశంతోనే రామ్ చరణ్ ఫాదర్ బోయపాటి శ్రీనుని తీసుకున్నారు.వీరి ప్రయత్నం అంతా బాగుంది సినిమా కూడా బాగుంది.అయితే ఇప్పుడు మీరు చెప్పడంతో ఈ సినిమా ఫ్లాప్ అని తెలిసింది.

నాకు ఏ సినిమా డిజాస్టర్ అనే విషయం తెలియదు.ఎందుకంటే నేను ఇదివరకు ఆయన సినిమాలు ఒక్కటి కూడా చూడలేదు అంటూ గీతాకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ క్రమంలోనే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube