సురేష్ బాబు మోసం చేస్తే, శ్రీహరి జీవితం ఇచ్చాడు : దర్శకుడు చంద్ర మహేష్ 

ప్రేయసి రావే సినిమా తో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు చంద్ర మహేష్. 1999 లో వచ్చిన ఈ సినిమా లో శ్రీకాంత్ హీరో గా రాశి హీరోయిన్ గా నటించగా ఈ సినిమా వంద రోజులు ఆడింది.

 Director Chandra Mahesh About Suresh Babu Details, Chandra Mahesh, Director Chan-TeluguStop.com

ఈ సినిమా హిట్ అవ్వగానే చిరంజీవి ప్రేయసి రావే దర్శకుడు అయినా చంద్ర మహేష్ ని పిలిపించి ఒక స్క్రిప్ట్ రెడి చేయమని చెప్పారట.అందుకు ఎగిరి గంతేసి చంద్ర మహేష్ సంతోషంగా స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టారట.

అయితే స్క్రిప్ట్ పని అయిపోయే లోగా సురేష్ బాబు పిలిచి వెంకటేష్ కోసం ఒక కథ రాయమని చెప్పారట.

దాంతో కంగారు పడ్డ చంద్ర మహేష్ చిరంజీవి దగ్గరికి వెళ్లి నాకు మొదటి సినిమా ప్రేయసి రావే నన్ను నమ్మి రామ నాయుడు గారు ఇచ్చారు.

నాకు అన్నం పెట్టిన సంస్థ సర్ అందుకే వారు మళ్లీ పిలిచి ఒక కథ రాయమంటున్నారు అని చిరంజీవికి చెప్పాడట.దాంతో చిరంజీవి సైతం సంతోష పడి అల్ ద బెస్ట్ చెప్పి పంపించాడట.

అక్కడ నుంచి సురేష్ బాబు దగ్గరకు వెళ్లి కథ రాయడం మొదలు పెట్టాడట చంద్ర మహేష్.

Telugu Chandra Mahesh, Chiranjeevi, Preyasi Raave, Suresh Babu, Ramanaidu, Sri H

అయితే ఆ టైం లోనే ఎన్ శంకర్ దర్శకత్వం లో జయం మనదేరా సినిమా కు సురేష్ బాబు నిర్మాణం లో ఇంకో సినిమా మొదలు పెట్టగా చంద్ర మహేష్ షాక్ అయ్యాడట.వెంకటేష్ ఒక్కసారి సురేష్ బాబు తో సినిమా చేస్తే బయట సంస్థ తో మరొక సినిమా చేస్తే గాని మళ్లి తిరిగి సురేష్ ప్రొడక్షన్స్ లో చేయరు.దాంతో మరో రెండేళ్లు ఆగితే తప్ప వెంకటేష్ తో సినిమా ఉండే ఛాన్స్ లేదు కాబట్టి తాను చిరంజీవి తో కాకుండా ఇటు వెంకటేష్ తో కాకుండా అయిపోయాడు.

Telugu Chandra Mahesh, Chiranjeevi, Preyasi Raave, Suresh Babu, Ramanaidu, Sri H

అదే సమయం లో శ్రీహరి ప్రేయసి రావే సినిమా చూసి కథ ఏంటో కూడా అడగకుండానే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నారట.ఆలా ప్రేయసి రావే సినిమా తర్వాత శ్రీహరి తో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలు చేసాడు చంద్ర మహేష్.ఒక వేళా సురేష్ బాబు కథ కోసం అడిగి చేయించుకున్న కూడా వెంకటేష్ లాంటి హీరో తో సినిమా పడేది.లేదా చిరంజీవి కి అయినా కథ ఇచ్చి ఆయనతో సినిమా అయినా పూర్తయి ఈ రోజూ చంద్ర మహేష్ పరిస్థితి మరోలా ఉండేది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube