డీజే టిల్లును డైరెక్ట్ చేయబోతున్న బొమ్మరిల్లు భాస్కర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సందడి చేస్తున్నటువంటి సిద్దు జొన్నలగడ్డ( Siddu Jonnalagadda ) అనంతరం హీరోగా మారిపోయారు.

జోష్ ,ఆరెంజ్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సిద్దు గుంటూరు టాకీస్ సినిమా ద్వారా హీరోగా మారిపోయారు.

ఇలా ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో హీరోగా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు అయితే డీజే టిల్లు ( DJ Tillu )సినిమా మాత్రం ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది.ఇక ఈ సినిమా మంచి హిట్ కావడంతో ఈయనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం సిద్దు టిల్లు స్క్వేర్ సినిమా షూటింగ్ పనులతో పాటు ఇతర సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బొమ్మరిల్లు( Bommarillu ) సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ భాస్కర్( Director Bhaskar ) ఆరెంజ్ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు.అనంతరం ఈయన అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా పరవాలేదు అనిపించుకున్నారు అయితే త్వరలోనే బొమ్మరిల్లు భాస్కర్ సిద్దు జొన్నలగడ్డతో సినిమా చేయబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆరెంజ్ సినిమా( Orange )లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి సిద్దు జొన్నలగడ్డతో ఏకంగా ఓ సినిమా చేయబోతున్నారు అంటే ఇది నిజంగానే గ్రేట్ అని చెప్పాలి.అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా దాదాపు కరారు అయిందని,ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ఆగస్టు 10వ తేదీ ఘనంగా జరుపబోతున్నారని తెలుస్తోంది.ఇక ఇదే రోజున ఈ సినిమాకు సంబంధించి అన్ని విషయాలను కూడా అధికారకంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

తాజా వార్తలు