Anil Ravipudi Sindooram : సిందూరం సినిమా మొదటి సాంగ్ ఆనందమో ఆవేశమో ను విడుదల చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి !!

శివ బాలాజీ , ధర్మ , బ్రిగిడ సాగ(పవి టీచర్) ప్రధాన తారాగణంగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం సిందూరం.ఈ సినిమా లోని మొదటి పాట (ఆనందమో ఆవేశమో ) ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు విడుదల చేశారు.

 Director Anil Ravipudi Released The First Song Anandamo Avesmo From Sindooram, S-TeluguStop.com

ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సాంగ్ కు నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.ఎంతో ఆహ్లాదకరంగా రూపుదిద్దుకున్న ఈ పాటను అభయ్ జోద్పూర్కర్ ఆలపించారు.

ఆర్య సినిమా లోని “ఉప్పెనంత ఈ ప్రేమకు” పాట రాసిన బాలాజీ గారు ఈ పాటకు సాహిత్యం అందించగా, హరి గౌర సంగీతం అందించారు.ఆనందమో ఆవేశమో సాంగ్ లో ధర్మ, బ్రిగిడ సాగ(పవి టీచర్) బాగా నటించారని, సాంగ్ మెలోడీగా బాగుందని కామెంట్స్ వస్తున్నాయి.

ప్రముఖ హీరో విజయ్ సేతుపతి సైతం సాంగ్ గురించి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యడం విశేషం.

మారేడుమిల్లి ఫారెస్ట్ లో సింగిల్ షెడ్యూల్ లో చిత్ర యూనిట్ ఎంతో కష్టపడి సిందూరం సినిమా షూటింగ్ ను ఫినిష్ చేశారు.

ఈ పాట చూసిన ప్రేక్షకులు ఆహ్లాదకరమైన చిత్రీకరణ, అద్భుతమైన సంగీతం కలగలిపి ఉండడాన్ని చూసి దర్శకుడు, నిర్మాత అభిరుచిని చాలా అభినందిస్తున్నారు.

ఇప్పటికే సిందూరం టైటిల్ తో ఒకప్పటి క్లాసిక్ సిందూరం సినిమాను గుర్తు చేస్తున్న ఈ సినిమా రానున్న రోజుల్లో ఎన్ని సంచలనాలు సృష్టించబోతోందో వేచి చూడాలి.

నటీనటులు: శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ(పవి టీచర్)

సాంకేతిక నిపుణులు: బ్యానర్: శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్, డైరెక్టర్: శ్యామ్ తుమ్మలపల్లి, నిర్మాత: ప్రవీణ్ రెడ్డి జంగా, సహా నిర్మాతలు: చైతన్య కందుల, సుబ్బారెడ్డి.ఏం రైటర్: కిషోర్ శ్రీ కృష్ణ, సినిమాటోగ్రఫీ: కేశవ్, ఎడిటర్: జస్విన్ ప్రభు, ఆర్ట్: ఆరే మధుబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ బాలాజీ.డి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube