మంగళూరు ఆటోలో బాంబ్ బ్లాస్ట్ కేసులో పోలీసులు, ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు.ఇందులో భాగంగా నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు.
పేలుడు ఘటన నిందితుడు షరీఖ్ గా గుర్తించారు.షరీఖ్ కు సిమ్ కార్డ్ అందించిన మరో నిందితుడిని ఊటీలో అదుపులోకి తీసుకున్నారు.
గతంలో యూఏపీఏ యాక్ట్ కింద షరీఖ్ అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే బెయిల్ పై బయటకు వచ్చిన షరీఖ్ ఉగ్రవాదులతో టచ్ లో ఉన్నట్లు గుర్తించారు.
కాగా నిందితుడి స్వస్థలం కర్ణాటకలోని శివమొగ్గ అని, నిషేధిత పీఎఫ్ఐలో పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు.ఆటో రిక్షాను అద్దెకు తీసుకున్న నిందితుడు… ఐదు కిలోల ప్రెషర్ కుక్కర్ లో పేలుడు పదార్థాలు నింపాడని వెల్లడించారు.
మంగళూరు రైల్వే స్టేషన్ నుంచి ఘటనా స్థలానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.మరోవైపు బాంబ్ బ్లాస్ట్ లో కీలక సూత్రధారి గాయపడ్డాడు.







