ఇండైరెక్టుగా టీమిండియాకు ఆడేందుకు తాను ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్న దినేష్ కార్తిక్..!

భారత్ లో క్రికెటర్లు చెప్పే చిన్నచిన్న విషయాలు కూడా ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

తాజాగా టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెప్పిన విషయాలు కూడా వైరల్ అయ్యాయి.

టీమిండియాలో ఆడటానికి తాను సిద్దంగానే ఉన్నానని ఆయన చెప్పకనే చెప్పాడు.ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లలో కొందరు కరోనా పాజిటివ్ రావడంతో క్వారంటైన్ లో ఉన్నారు.

వారిలో తొమ్మిది రోజులుగా క్వారంటైన్ లో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు.ప్రస్తుతం అతనితో పాటుగా ఇంకో కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా ఐసోలేషన్ లో ఉన్నాడు.

సపోర్ట్ స్టాఫ్ మెంబర్ దయానంద్ గరానీకి కరోనా పాజిటివ్ వచ్చింది.దీంతో సాహా కూడా ఐసోలేషన్ లో ఉండాల్సి వచ్చింది.

Advertisement

ఇప్పుడు వీళ్లు ఇలా ఐసోలేషన్ లో ఉంటే టీమిండియా వికెట్ కీపర్ పొజిషన్ మాత్రం ప్రశ్నార్థకంగా తయారైంది.మూడు రోజుల ప్రాక్టీస్ టెస్టులో వికెట్ కీపర్ అనేవారు కనిపించలేదు.

దీంతో తాను ఆడటానికి సిద్దంగా ఉన్నానంటూ దినేశ్ కార్తీక్ ట్వీట్ చేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది.హాలీడే పీరియడ్ లో ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి భారత క్రికెట్ జట్టులో పలువురికి కరోనా వైరస్ సోకిందని తెలుస్తోంది.

ముఖ్యంగా వారిలో వికెట్ కీపర్ పంత్, గరానీల పేర్లను బీసీసీఐ తెలిపింది.వారితో కాంటాక్ట్ అయినటువంటి మిగిలిన వారిని కూడా ఐసోలేషన్ లో ఉంచడం జరిగింది.

పంత్ ను లండన్ లో తన స్నేహితుడి వద్దే ఉంచినట్లు సమాచారం.టీమిండియాకు వికెట్ కీపర్ లేకపోవడం పట్ల ఇటువంటి క్లిష్ట సమయంలో కీపింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ దినేశ్ కార్తీక్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
దారుణం: ఐసీ క్రీం ఇప్పిస్తామంటూ లైంగిక దాడి!

కిట్ బ్యాగ్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ చెప్తున్నానంతే అని ట్యాగ్ చేశాడు.

Advertisement

ప్రస్తుతం దినేష్ కార్తీక్ ఇంగ్లాండ్ లో ఓ కామెంటేటర్ లాగా ఉన్నాడు.ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ కు కామెంటేటర్ గా కూడా దినేశ్ కార్తీక్ వ్యవహరించాడు.జులై 20న జరగనున్నటువంటి ఈ ప్రాక్టీస్ టెస్టుకు కేఎల్ రాహుల్ ఒక్కడే ఆప్షన్ గా కనిపించినప్పటికీ దినేశ్ కార్తీక్ ని బీసీసీఐ తీసుకుంటా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

తాజా వార్తలు