ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దినేశ్ కార్తిక్ హవా.. ఏకంగా 108 స్థానాలు

ఏ రంగంలో అయినా సరే కష్టపడితే ఎప్పటికీ ఫలితం ఉంటుంది.అందుకే కష్టేపలి అంటారు పెద్దలు.

 Dinesh Karthik Hawa In Icc Rankings Dinesh Karthik, Viral Latest, News Viral, Sp-TeluguStop.com

కష్టాన్ని నమ్ముకుంటే ఎప్పటికైనా విజయం సాధించగలరు.కష్టంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యేవారు కూడా ఉంటారు.

మరికొంతమంది ఓవర్ నైట్ స్టార్ అయ కొద్దిరోజులకే కనుమరుగైపోతారు.ఇలా కనుమరుగై మళ్లీ కొద్దిరోజులకు ఫామ్ లోకి వస్తారు.

ఇప్పుడు టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా అదే బాటలో నడుస్తున్నాయి.

గతంలో అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరపున తన బ్యాటింగ్ తో మైమరిపించాడు దినేశ్ కార్తీక్.తన బ్యాటింగ్ తో క్రికెట్ అభిమానులతో అలరించాడు.

టీమిండియాకు ఎన్నో విజయాలను తెచ్చి పెట్టాడు.అయితే ఆ తర్వాత ఫామ్ తగ్గిపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో ఐపీఎల్ లో గత కొన్నేళ్లుగా అడుతున్నాడు.కోల్ కతా నైట్ రైడర్స్ కు కెప్టెన్ గా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాడు.

Telugu Dinesh Karthik, Latest-Latest News - Telugu

ఆ తర్వాత ఆ టీమ్ నుంచి బయటకు వచ్చి ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరాడు.తన బ్యాటింగ్ తో ఆర్సీబీకి అనేక విజయాలు సాధించి పెట్టాడు.బ్యాటింగ్ లో చెలరేగిపోయి చాలా సంవత్సరాల తర్వాత తన సత్తా ఏంటో చూపించాడు.

దీంతో టీమిండియాలో దినేశ్ కార్తీక్ కు మళ్లీ చోటు దక్కింది.చాలా సంవత్సరాల తర్వాత టీమిండియాలో స్థానం దక్కించుకున్న దినేశ్ కార్తీక్.

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో తన బ్యాటింగ్ తో సత్తా చాటాడు.దీంతో తాజాగా విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో దినేశ్ పైకి ఎగిశాడు.

దినేశ్ కార్తీక్ ఏకంగా 108 స్థానాలు ఎగబాకి 87వ స్థానానికి చేరుకున్నాడు.ఇక ఇషాన్ కిషన్ ఒక స్ధానం మెరుగుపర్చుకుని 6వ స్థానంలో నిలిచాడు.

ఇక పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ తొలి స్థానంలో, మహ్మద్ రిజ్వాన్ రెండో స్థానంలో ఉన్నారు.ఇక బౌలర్ల జాబితాలో యుజువేంద్ర చాహల్ 23వ స్థానంలో ఉండగా.

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోస్ హేజిల్ వుడ్ తొలి స్థానంలో ఉన్నాడు.ఇక టెస్టుల విషయానికొస్తే.

ఆల్ రౌండర్ల జాబితాలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు.బంగ్లాదేశ్ కెప్టపెన్ షకీబ్ హల్ హసన్ రెండో స్థానంలో, టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక బ్యాటింగ్ విషయంలో విరాట్ కోహ్లీ 10వ స్థానంలో ఉండగా.బౌలర్ల విభాగంలో అశ్విర్ రెండో స్థానంలో, బూమ్రా మూడో స్థానంలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube