సగం షూటింగ్ అయ్యాక డైరక్టర్ ని మార్చేశారు..!

యువ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్ లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తనయురాలు దివ్య నిర్మాణంలో వస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని.సగం షూటింగ్ అయ్యాక అనూహ్యంగా సినిమా నుంచి దర్శకుడిని తప్పించినట్టు తెలుస్తుంది.ఈ సినిమాను కార్తీక్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు.కథ కూడా ఆయనదే.అయితే సగం సినిమా అయ్యాక రష్ చూస్తే సినిమా అనుకున్న విధంగా రావట్లేదని అర్ధమైందట.అందుకే వెంటనే డైరక్టర్ ని మార్చినట్టు తెలుస్తుంది.

 Director Change For Young Hero Kiran Abbavaram Movie  Kiran Abbavaram  , Directo-TeluguStop.com

కోడి రామకృష్ణ కూతురు మొదటి సినిమాగా వస్తున్న నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ఎట్టి పరిస్థితుల్లో అంచనాలకు తగ్గకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.

కార్తీక్ శంకర్ కథనే కిరణ్ అబ్బవరం తో ఎస్.

ఆర్ కళ్యాణ మండపం చేసిన శ్రీధర్ గాదె ఈ సినిమాని డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.ఇప్పటివరకు జరిగిన రష్ కి సరిపోయేలా మిగతా సినిమా షూటింగ్ జరుగనుంది.

సగం సినిమా షూటింగ్ అయ్యాక డైరక్టర్ చేంజ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సమ్మతమే సినిమా చేశాడు.

ఆ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube