బాలయ్య డైలాగ్ తో సోషల్ మీడియాలో రచ్చ చేసిన డింపుల్.. నో పోలీస్ అంటూ?

తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేసినా డింపుల్ హయతి( Dimple Hayati )కి పెద్దగా గుర్తింపు రాలేదు.అయితే తాజాగా చిక్కుకున్న వివాదం ద్వారా డింపుల్ వార్తల్లో నిలిచారు.

 Dimple Hayathi Shocking Post Goes Viral In Social Media Details Here,dimple Haya-TeluguStop.com

ఖిలాడీ, రామబాణం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ మంచి ఆఫర్ వస్తే స్టార్ స్టేటస్ ను అందుకుంటానని భావిస్తున్నారు.అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయగా ఆ వీడియో హాట్ టాపిక్ అవుతోంది.

సింహా సినిమా( Simha Movie )లో బాలయ్య ఒక సందర్భంలో పోలీసుల నిర్లక్ష్యం గురించి చెప్పిన డైలాగ్ ను ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.తనపై క్రిమినల్ కేసు( Dimple Hayati Police Case ) ఫైల్ అయిన వెంటనే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పులను కప్పిపుచ్చుకోలేరంటూ ఆమె కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.“అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే” అంటూ బాలయ్య( Balakrishna Dialogues ) చెప్పిన డైలాగ్ ను డింపుల్ షేర్ చేయడం ద్వారా ఒక మెసేజ్ ను అభిమానులకు పాస్ చేశారు.

తాను ఎలాంటి తప్పు చేయకపోయినా పోలీసులు( Police ) అనవసరంగా తనను టార్గెట్ చేస్తున్నారని ఈ పోస్ట్ ద్వారా ఆమె పరోక్షంగా చెప్పకనే చెబుతున్నారు.

డింపుల్ హయాతి రెమ్యునరేషన్ కూడా పరిమితంగా ఉండగా ఆమెకు ఈ ఏడాది కలిసొస్తుందో లేదో చూడాల్సి ఉంది.తెల్లవారుజామున డింపుల్ షేర్ చేసిన పోస్ట్ కు 2500కు పైగా లైక్స్ వచ్చాయి.

డింపుల్ తెలుగమ్మాయి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఆమెకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఎంతో కష్టపడి డింపుల్ హయాతి కెరీర్ పరంగా ఈ స్థాయికి ఎదిగారు.డింపుల్ హయాతి తనపై నమోదైన కేసు నుంచి బయటపెడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నాఅరు.డింపుల్ హయాతి సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube