మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రం విడుదలను రెండు వారాలు ఆలస్యం చేస్తూ దిల్‌రాజు ప్రకటించాడు.ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన మూవీని మే 9న విడుదల చేయాలని నిర్ణయించారు.
అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసేందుకు దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.మీడియా సమావేశంలో మహేష్ బాబు కెరీర్‌లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుందని చెప్పడంతో పాటు, తమ బ్యానర్‌లో కూడా ఇది ప్రతిష్టాత్మక చిత్రంగా ఉంటుందని దిల్‌రాజు చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రాన్ని దిల్ రాజు మరో ఇద్దరు నిర్మాతలు అశ్వినీదత్ మరియు ప్రసాద్ వి పొట్లూరితో కలిసి నిర్మిస్తున్న విషయం తెల్సిందే.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను మే 9న విడుదల చేయబోతున్నందుకు సంతోషంగా ఉందని, ఎందుకంటే మే నెల సెంటిమెంట్ పరంగా చాలా మంచి ఫలితాలు వస్తాయని అన్నాడు.అశ్వినీదత్ గారి బ్యానర్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి మరియు మహానటి చిత్రాలు మే 9న విడుదల అయ్యాయి.ఇక మా బ్యానర్‌లో వచ్చిన పరుగు మరియు భద్ర చిత్రాలు కూడా మే నెలలో విడుదల అయ్యాయి.

తప్పకుండా మే నెల సెంటిమెంట్‌తో ‘మహర్షి’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను నిర్మాత దిల్‌రాజు వ్యక్తం చేశాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నామని, త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తి చేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపబోతున్నట్లుగా దిల్‌రాజు ప్రకటించాడు.ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించగా, కీలక పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు.మహేష్‌బాబు ఈ చిత్రంలో ప్రముఖ విదేశీ బిజినెస్‌మన్‌గా మరియు పల్లెటూరులో వ్యవసాయం చేసే కుర్రాడిగా కూడా కనిపించబోతున్నాడు.
ఒకే పాత్రను విభిన్న రకాలుగా దర్శకుడు వంశీ పైడిపల్లి చూపించబోతున్నాడు.