తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దిల్ రాజు( Dil Raju ) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే.దిల్ రాజు తండ్రి గారు శ్యాంసుందర్ రెడ్డి( Shyamsunder Reddy )(86) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో మరణించారు.
అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఈయన బాధపడుతున్నారు.అయితే సోమవారం సాయంత్రం ఈయన పరిస్థితి విషమించడంతో మరణించారు.
ఈ విధంగా దిల్ రాజు తండ్రి మరణించారనే విషయం తెలియడంతో సినీ సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి తన తండ్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
ఇక నేడు సాయంత్రం ఈయన అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక దిల్ రాజు తన తండ్రి మరణంతో చిన్నపిల్లాడిలా ఏడ్చారని తెలుస్తుంది.
ఇక తన తండ్రి అంత్యక్రియలలో నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొనడంతో తనని చూసిన దిల్ రాజు ఎంతో భావోద్వేగానికి గురై ఏడవడంతో ప్రకాష్ రాజ్ తనని ఓదార్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇలా దిల్ రాజు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.
రాజు తండ్రి పేరు శ్యామ్ సుందర్ రెడ్డి తల్లి ప్రమీల ఈ దంపతులకు ముగ్గురు సంతానం దిల్ రాజు తో పాటు ఈయనకు మరో ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు.నిజామాబాద్ జిల్లాలో జన్మించినటువంటి దిల్ రాజు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.ఈయన ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
దిల్ రాజు భార్య అనిత ( Anitha ) కూడా 2017 వ సంవత్సరంలో గుండెపోటుకు గురై మరణించిన విషయం తెలిసిందే .ఇలా మొదటి భార్య చనిపోవడంతో కుటుంబ సభ్యుల బలవంతంతో ఈయన 2020 వ సంవత్సరంలో తేజస్విని( Tejaswini )అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు.ప్రస్తుత ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.తన మామయ్య మరణించడంతో దిల్ రాజు భార్య తేజస్విని కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారు.