పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరంగల్ కాంగ్రెస్లో( Parliament elections) విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.ఈ మేరకు మంత్రి కొండా సురేఖ(Konda Surekha), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి(Revuri Prakash Reddy) మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఈ క్రమంలోనే తమ వర్గం నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎమ్మెల్యే రేవూరిపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గీసుకొండలో తమ వర్గీయులను పక్కన పెడుతున్నారని మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తమ వర్గం నేతలకు న్యాయం చేయకపోతే చూస్తూ ఊరుకోబోమని మంత్రి కొండా సురేఖ హెచ్చరికలు జారీ చేశారు.ఈ క్రమంలోనే కొండా సురేఖ, రేవూరి మధ్య వాగ్వివాదం చెలరేగగా.
అందుకు సంబంధించిన ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది.







