ఒకవైపు జనసేన పార్టీ కి( Janasena ) సీట్ల కేటాయింపు విషయంలో పార్టీ నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) సతమతం అవుతుండగా, కొన్ని కొన్ని కీలక నియోజకవర్గలకు చెందిన కీలక నాయకులు సీట్ల విషయంలో ఆధిపత్య పోరుకి దిగుతూ టికెట్ తమకంటే , తమకు కేటాయించబోతున్నారంటూ పార్టీ కేడర్ ను గందరగోళం లోకి పడేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తలెత్తింది.
ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ( Undi Constituency ) విషయానికి వస్తే , ఇక్కడ టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంతెన రామరాజు( Mantena Ramaraju ) ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ పార్టీ అధిష్టానం కేటాయిస్తుందనే నమ్మకంతో రామరాజు ఉండగా, ఉండి నుంచే పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు( Vetukuri Venkata Sivaramaraju ) ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో ఈ ఇరువురు నేతలు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీ అధిష్టానం సీటు కేటాయించబోతుందనే విషయాన్ని ప్రకటిస్తూ.పార్టీ క్యాడర్ ను గందరగోళానికి గురిచేస్తున్నారు.2019 ఎన్నికల్లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న మంతెన రామరాజుకు నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా శివరామరాజు చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లారు.అయితే అప్పటికే టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజుని ఎంపీగా పోటీ చేసి, రామరాజుకు ఉండి ఎమ్మెల్యే టికెట్( Undi MLA Ticket ) ఇద్దామని చంద్రబాబు సూచించారు.
దీంతో ఆ సీటును త్యాగం చేసి రామరాజు విజయానికి శివ రామరాజు కృషి చేశారు.అనూహ్యంగా ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన శివరామరాజు ఓటమి చెందగా, ఉండి నుంచి ఎమ్మెల్యేగా రామరాజు గెలుపొందారు.
వచ్చే ఎన్నికల్లో తనకే సీటు కేటాయించబోతున్నారని, ఈ మేరకు నారా లోకేష్( Nara Lokesh ) తనకు హామీ ఇచ్చారని రామరాజు చెబుతుండగా, టిడిపి అధినేత చంద్రబాబు తనకే టికెట్ కేటాయించబోతున్నారని , ఈ మేరకు తనకు హామీ ఇచ్చారని శివరామరాజు ప్రకటిస్తున్నారు.దీంతో ఇద్దరు నేతల్లో ఎవరికి సీటు దక్కుతుందో తెలియక ఏ వర్గంలో ఉండాలో తేల్చుకోలేక అక్కడ టిడిపి నాయకులు సతమతం అవుతున్నారు.కొంతమంది గ్రూపులుగా విడిపోయారు.
ఒక వర్గం ఎమ్మెల్యే రామరాజు పై విమర్శలు చేస్తుండగా , మరొక వర్గం మాజీ ఎమ్మెల్యే శివరామరాజు పై విమర్శలకు దిగుతోంది.దీంతో ఈ వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
భీమవరంలో ఒకే కార్యాలయంలో ఉండే ఈ ఇద్దరు నేతలు మధ్య పోరు తీవ్రత కావడం చర్చనీయాంశంగా మారింది.
పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు తనను పిలవకుండా ఎమ్మెల్యే రామరాజు అవమానిస్తున్నారని శివరామరాజు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట.వారం రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తూ ఎమ్మెల్యే రామరాజు పై విమర్శలకు దిగారు.2019లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా( Narasapuram MP Candidate ) ఆయనకు అవకాశం ఇవ్వాల్సిందిగా చంద్రబాబు వద్దకు తానే తీసుకువెళ్తే .పదో తరగతి కూడా పాస్ కానీ వాడికి ఎంపీ టికెట్ ఏమిటని చంద్రబాబు అన్నారని , అందువల్లే తాను ఎంపీగా పోటీ చేసి అతనికి ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి గెలిపించుకున్నానని , ఇప్పుడు ఆయన విశ్వాసం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ఎమ్మెల్యే రామరాజు వర్గం కూడా శివరామరాజు పై విమర్శలకు దిగింది. ఈ మేరకు పార్టీకి చెందిన కొంతమంది నియోజకవర్గ నాయకులు సమావేశం నిర్వహించి ఈ నియోజకవర్గానికి గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు ఏం చేశారని, బీసీలకు ఏం చేశాడని ? అసలు ఆయన అభ్యర్థి కాదని ఆయనకు టికెట్ ఇస్తామని పార్టీలో ఎవరు హామీ ఇవ్వలేదని విమర్శలకు దిగారు.నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అటు శివరామరాజు, ఇటు రామరాజు ఎవరికి వారు ఎమ్మెల్యే టికెట్ తమకే అన్న ధీమాలో ఉన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy