ప్రస్తుత సమాజంలో వైద్యం అనేది చాల అభివృద్ధి చెందింది.గతంలో వైద్యసదుపాయాలు లేక,వైద్యం అంది అందకా కొన్ని వందలాది మంది చనిపోయేవారు.
కానీ ఇపుడు పరిస్థితి అలా లేదు.మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
అయితే సాధారణ జనాలకు చదువు తెలియని వారికీ కూడా వైద్యానికి సంబందించిన విషయాలను తెలియ చేయడం కోసం కొన్ని చిహ్నాలు అందుబాటులో తిస్కోరావటం జరిగింది.అందులోనివే ఈ రెండు గుర్తులు.

ఈ రెండు గుర్తులు ఎక్కడ కనిపించినా,అది ఆరోగ్యానికి సంబంధించినదిగా ప్రతి ఒక్కరు గుర్తు పట్టడం ఖాయం.అయితే చూడటానికి ఆ రెండు గుర్తులు ఒకే లాగా ఉండటాన్ని చూసి చాలా మంది కన్ప్యూజ్ అవుతూ ఉంటారు.ఇ రెండుగుర్తులో ఒకటి ఎరుపు రంగులో మరొకటి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.ఈ రెండు రంగులు కూడా వేరు వేరే అర్దాలను తెలియ జేస్తాయి.అయితే అసలు విషయానికి వస్తే…
1.ఎరుపు రంగు వైద్యానికి సంబందించినది,ఎరుపు రంగు గుర్తును హాస్పిటల్స్ లో మరియు హాస్పిటల్స్ కు సంబందించిన వాహనాలపై వాడుతారు.
2.ముదురు ఆకుపచ్చ గుర్తును మెడిసిన్ కు సింబల్ గా వేస్తారు.
దీన్ని ఎక్కువగా మందుల షాపుపై,మరియు మందుల షాపులకు సంబందించిన వాహనాలపై ఈ ఆకుపచ్చ గుర్తు కనిపిస్తుంది.