నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగేస్తే కుదరదు కదా ! దాని వాళ్ళ ఆ తరువాత ఎన్నో కస్టాలు పడాలి.అందుకే అంటారు కాలు జారినా పర్లేదు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము అని.
సాంకేతిక విప్లవం పెరిగిపోయాక అందరి గుట్టు ఇట్టే తెలిసిపోతోంది.ముఖ్యంగా సెల్ ఫోన్ ఇప్పుడు అందరికి ఎంత బాగా ఉపయోగపడుతుందో అంతే స్థాయిలో ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతోంది.
ముఖ్యంగా రాజకీయ నాయకులకు.అందులోనూ నోటి దురుసు ఉన్న నాయకులకు అది పెద్ద శాపంగా మారింది.
అది కూడా వారి రాజకీయ భవిష్యత్తుని మార్చేసే స్థాయిలో.
రాజకీయ నాయకులు తరుచు బహిరంగ సమావేశాల్లో నోరు జారుతూ ఆ తరువాత తీరిగ్గా నాలుక్కరుచుకుంటూ ఉంటారు.
ఇక అంతర్గతంగా, ఫోన్‌లలో అయితే నేతల నోటికి అదుపు ఉండదు.తమకు ఎదురుతిరిగినా చెప్పినట్లు వినకపోయినా ప్రత్యర్థులైనా, అధికారులైనా చివరికి సొంత పార్టీకి చెందిన వారైనా ఎవరైనా వారికి అనవసరం తిట్ల పురాణం మాత్రం అందుకుంటూ ఉంటారు.
బహిరంగసభలు, సమావేశాల్లో నేతల మాటలకు కొంత అదుపు ఉంటుంది.ఫోన్‌లో అయితే నేతల మరింత రెచ్చిపోతున్నారు.
ముందు వెనుక ఆలోచించకుండా నోటికి పని చెబుతున్నారు.నేతలు చెప్పిన పని చేయకపోయినా ఎదురు తిరిగినా నేతల ఆగ్రహం మాములుగా ఉండదు.
అవతలి వ్యక్తి ఫోన్‌లో వినలేని భాష ఉపయోగిస్తారు.బూతులు ఉపయోగించడంలోనూ నేతల తర్వాతే ఎవరైనా.
అయితే నేతల బెదిరింపులు, మాట తీరు కాస్తా బాధితులు రికార్డు చేస్తుండటంతో అడ్డంగా బుక్కవుతున్నారు.వారు మాట్లాడిన ప్రతి మాటను రికార్డు చేసి మీడియాకు విడుదల చేస్తున్నారు.
దీంతో వారి పరువు బజారున పడుతోంది.

రాజకీయ నేతలు ఫోన్‌లో మాట్లాడేటపుడు ఎవరితోనైనా జాగ్రత్తగా మాట్లాడకపోతే విమర్శలు పాలు కావాల్సిందే.తమ వాయిస్‌ను ఎవరు రికార్డు చేయరని అనుకుంటే తప్పులో కాలేసినట్లే.తెలంగాణలో అధికార పార్టీ నేతలయితే మరింత రెచ్చిపోతున్నారు.
తాము చెప్పింది వింటే సరే లేదంటే వారికి చూపించే నరకం మరోలా ఉంటుంది.మొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం, నిన్న మంచిర్యాల జిల్లాకు చెందిన చిన్నయ్య, తాజాగా ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మందా జగన్నాథం ముగ్గురు కూడా ఫోన్‌లలో రెచ్చిపోయారు.
మాజీ ఎంపీ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న మందా జగన్నాథం ఓ మీడియా ప్రతినిధిని ఫోన్‌లో ఇష్టమొచ్చినట్లు తిట్టారు.తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మందా జగన్నాథం కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ వార్త రాశారు.
ఇంకేముందీ తిట్టిన తిట్టు తిట్టకుండా రిపోర్టర్‌కు ఫోన్ చేసి తిట్టాడు.ఆ బెదిరింపులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
గత డిసెంబర్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం నల్గొండ జిల్లాకు చెందిన డీసీసీబీ బ్యాంక్ సీఈవోను ఫోన్‌లో బెదిరించారు.నల్గొండ డీసీసీబీ బ్యాంకులో డీజీఎమ్‌గా పనిచేస్తున్న లక్ష్మమ్మ 2015లో సస్పెండ్ అయ్యింది.
రెండేళ్లుగా సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో బాధితురాలు ఆమె ఎమ్మెల్యే వీరేశంను ఆశ్రయించింది.లక్ష్మమ్మను తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని, అలా జరగకపోతే 10 లక్షలు లంచం డిమాండ్ చేశావని సీఎంకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు.
బాధితుడు వీరేశం వాయిస్‌ను ఫోన్‌లో రికార్డ్ చేసి మీడియాకు విడుదల చేయడంతో ఎమ్యెల్యే పరువు పోయింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ అవిశ్వాసం విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రెచ్చిపోయారు.34వ వార్డు కౌన్సిలర్ సత్యవతి కూతురుకి ఫోన్ చేసి ఛైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న క్యాంపు నుంచి బయటికి రావాలంటూ ఫోన్‌లో బెదిరింపులకు దిగాడు.మాట వినకపోతే ఏం చేయాలో మాకు తెలుసన్న చిన్నయ్య ఎవర్ని ఎలా ఇబ్బంది పెట్టాలో కూడా తెలుసంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఏ అధికారి అయినా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటారని ప్రభుత్వం తలచుకుంటే క్యాంపు రాజకీయాలు ఎంత సేపు అంటూ కౌన్సిలర్‌ను కూతుర్ని హెచ్చరించారు.కౌన్సిలర్ కూతురు ఎమ్మెల్యే వాయిస్‌ను రికార్డ్ చేసి మీడియాకు విడుదల చేసింది.
ఇవొక్కటే ఇలాంటి వ్యవహారాలు అనేకం జరుగుతున్నాయి.కాబట్టి సెల్ లో మాట్లాడే ముందు నాయకులు కాస్త ఆలోచించుకుని మాట్లాడితే బెటర్ !
.






